IND vs NZ 1st T20I: వర్షం కారణంగా టాస్ ఆలస్యం... వెల్లింగ్టన్‌లోనూ వదలని వరుణుడు...

Published : Nov 18, 2022, 11:36 AM IST
IND vs NZ 1st T20I: వర్షం కారణంగా టాస్ ఆలస్యం... వెల్లింగ్టన్‌లోనూ వదలని వరుణుడు...

సారాంశం

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానున్న తొలి టీ20 మ్యాచ్... హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీకి పరీక్షగా టీ20 సిరీస్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్‌లో ఓడిన ఇండియా,న్యూజిలాండ్ జట్లు... నేటి నుంచి టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత భారత్‌లో ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగగా, ఈసారి...న్యూజిలాండ్ వేదికగా సిరీస్ జరుగుతోంది... వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ 2 నుంచి టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. గ్రూప్ 1 నుంచి టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన న్యూజిలాండ్ జట్టు, పాకిస్తాన్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది...

టీ20 సిరీసుల్లో న్యూజిలాండ్‌పై టీమిండియాకి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 20 టీ20 మ్యాచులు జరగగా అందులో 11 మ్యాచులను టీమిండియా గెలిచింది. 9 మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌కి మంచి రికార్డు ఉంది. ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది కివీస్ జట్టు...

అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌ని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?