ఫాదర్స్ డేన కొడుకుకి పరిచయం చేసిన యువరాజ్ సింగ్... భార్య హాజెల్ కీచ్ పేరును జోడించి..

Published : Jun 19, 2022, 05:04 PM ISTUpdated : Jun 19, 2022, 05:18 PM IST
ఫాదర్స్ డేన కొడుకుకి పరిచయం చేసిన యువరాజ్ సింగ్... భార్య హాజెల్ కీచ్ పేరును జోడించి..

సారాంశం

రిపబ్లిక్ డే రోజున మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్... కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన భారత మాజీ ఆల్‌రౌండర్.. 

భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. ఫాదర్స్ డే స్పెషల్‌గా తన కొడుకుని అభిమానులకు పరిచయం చేశాడు.. యువీ భార్య, బాలీవుడ్ నటి, మోడల్ హాజల్ కీచ్... జనవరి 26 భారత రిప్లబిక్ డే రోజున మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన ఆరు నెలలకు కొడుకుకి ఓరియన్ కీచ్ సింగ్ అని నామకరణం చేశారు యువీ, కీచ్ జంట. ‘వెల్ కమ్ టు ది వరల్డ్ ఓరియన్ కీచ్ సింగ్. మమ్మీ, డాడీ... వారి లిటిల్ పుత్తర్‌ని ఎంతో ప్రేమిస్తారు. నువ్వు నవ్విస్తూ, నీ కళ్లను కొట్టే పద్దతి, నీ పేరులాగే స్టార్‌గా నిలబెడుతుంది...’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చిన యువరాజ్ సింగ్, కొడుకు ఫోటోలను షేర్ చేశాడు...

 

బాలీవుడ్ హీరోయిన్లు కిమ్ శర్మ, దీపికా పదుకొనే వంటి వారితో ప్రేమాయణం నడిపిన యువరాజ్ సింగ్... 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత లెఫ్ట్ హ్యాండ్  స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్, 2012లో క్యాన్సర్ బారిన పడి, దాని నుంచి కోలుకున్నాడు. క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత నవంబర్ 2015లో ఆంగ్లో ఇండియన్ హాజెల్ కీచ్‌తో యువీ నిశ్చితార్థం జరిగింది...  ఏడాది తర్వాత నవంబర్ 2016లో హాజెల్ కీచ్‌ ని యువరాజ్ సింగ్ పెళ్లి చేసుకున్నారు...

పెళ్లైన తర్వాత పూర్తిగా మారిపోయిన హాజెల్ కీచ్, డిప్రెషన్‌తో పాటు అనారోగ్య సమస్యలతో పోరాడి విజయం సాధించింది. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 402 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్,  ఓవరాల్‌గా 11,778 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ కెరీర్‌లో 17 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు  ఉన్నాయి. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన యువరాజ్ సింగ్, తన కెరీర్‌లో 148 వికెట్లు పడగొట్టాడు...

వన్డే క్రికెట్‌లో యువరాజ్ ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్ గెలిచాడు. భారత జట్టు 2011 ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, ఆ టోర్నీలో350కి పైగా పరుగులు, 15 వికెట్లు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. అయితే కెరీర్ చరమాంకంలో అంతర్జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్, టీమిండియాలో ప్లేస్ కోసం రెండేళ్లకు పైగా ఎదురుచూసి రిటైర్మెంట్ ప్రకటించాడు...

రిటైర్మెంట్ తర్వాత రీఎంట్రీ ఇవ్వాలని భావించినా, కొన్ని విదేశీ లీగుల్లో పాల్గొనడంతో యువీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన యువీ, యూట్యూబ్ వీడియోలను అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?