టెస్టులపై బంగ్లాదేశ్ షాక్: మండిపడుతున్న పాకిస్తాన్ పెద్దలు

By telugu teamFirst Published Dec 24, 2019, 1:53 PM IST
Highlights

పాకిస్తాన్ లో టెస్టు క్రికెట్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పష్టం చేసింది. దీంతో బీసీబీపై పాకిస్తాన్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్, కెప్టెన్  అజహర్ తీవ్రంగా మండిపడ్డారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ తమ దేశంలో పర్యటిస్తుందని పీసీబీ చైర్మన్ ఇషాన్ మని ప్రకటించిన కొద్ది గంటల్లోనే బంగ్లాదేశ్ పాిస్తాన్ పర్యటనపై తన నిర్ణయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచులు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. 

పాకిస్తాన్ లో టీ20లు మాత్రమే ఆడుతామని, టెస్టులు మాత్రం తటస్థ వేదికపై ఆడుతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తేల్చి చెప్పింది. పాకిస్తాన్ లో ఎక్కువ రోజులు ఉండడానికి బంగ్లాదేశ్ క్రికెటర్లు అయిష్టత వ్యక్తం చేయడం వల్ల బీసీబీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీసీబీపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ అజహర్ ్లీ, హెడ్ కోచ్ మిస్బావుల్ హక్ కూడా బీసీబీ తీరును తప్పు పట్టారు. కేవలం టీ20లు మాత్రమే ఆడుతామని చెప్పడం అనైతకమని మిస్బా, అజహర్ అన్నారు. 

Also Read: క్రికెట్: ఇండియాపై విషం కక్కిన పీసీబీ చైర్మన్ ఇషాన్

పాకిస్తాన్ లో క్రికెట్ తిరిగి మనుగడ సాగించాలంటే టెస్టులతోనే సాధ్యమని, వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్ లు నిర్వహిస్తేనే పాకిస్తాన్లో క్రికెట్ బతుకుతుందని, దీని కోసం పీసీబీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. ఈ స్థితిలో టెస్టులు ఆడబోమని చెప్పడం సరి కాదని, ఈ విషయంలో బీసీబీ తీరును సహించబోమని వారన్నారు. టెస్టులు ఆడకపోతే బంగ్లాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

బంగ్లాదేశ్ కోరినట్లు టీ20లు మాత్రమే ఆడనిస్తే మిగతా దేశాలు కూడా అదే బాటలో నడుస్తాయని, దీనివల్ల పాకిస్తాన్ లో టెస్టు క్రికెట్ మనుగడ ప్రమాదంలో పడుతుందని వారన్నారు. శ్రీలంక జట్టు టెస్టు సిరీస్ ను విజయవంతంగా ముగించిందని, శ్రీలంక దారిలోనే మరిన్ని జట్లు అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.

బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు ఇషాన్ మని చెప్పారు. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తటస్థ వేదికలపై మ్యాచులు నిర్వహించబోమని స్పష్టం చేశారు 

click me!