ఆస్ట్రేలియాకి ఊహించని షాక్... పాక్ పర్యటనకు ముందు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా...

Published : Feb 05, 2022, 09:32 AM ISTUpdated : Feb 05, 2022, 09:33 AM IST
ఆస్ట్రేలియాకి ఊహించని షాక్... పాక్ పర్యటనకు ముందు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా...

సారాంశం

ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ పదవికి జస్టన్ లాంగర్ రాజీనామా... ఆస్ట్రేలియా జట్టులో కొందరు ప్లేయర్లతో విభేదాల కారణంగానే ఈ ఆకస్మిక నిర్ణయం?...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి ఊహించిన షాక్ తగిలింది. స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టన్ లాంగర్, తన పదవికి రాజీనామా చేశాడు...

జస్టన్ లాంగర్ సారథ్యంలోనే ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ టైటిల్ కూడా సాధించింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా టీమ్‌లోని కొందరు ప్లేయర్లతో విభేదాలు, గవర్నింగ్ బాడీతో తీవ్రమైన చర్చల తర్వాతే జస్టన్ లాంగర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది...

2018 ఆస్ట్రేలియా జట్టు, సౌతాఫ్రికాలో బాల్ టాంపరింగ్‌ స్కాండల్‌లో ఇరుక్కున్న సమయంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు జస్టన్ లాంగర్. బంగ్లాదేశ్‌తో, వెస్టిండీస్‌లో టీ20 సిరీస్‌లు కోల్పోయి వరుస ఓటములతో దిగజారిన ఆస్ట్రేలియా జట్టు, ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ సాధించింది...

జస్టిన్ లాంగర్ రాజీనామాని క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే ఆమోదించింది. ఫిబ్రవరి 11 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది ఆస్ట్రేలియా జట్టు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 5 వరకూ జరిగే పాక్ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. 
జస్టన్ లాంగర్ స్థానంలో ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ని తాత్కాలిక హెడ్ కోచ్‌గా నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా. 

ఆస్ట్రేలియా తరుపున 105 టెస్టులు ఆడిన జస్టిన్ లాంగర్, 45.27 సగటుతో 7696 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు కూడా ఉన్నాయి. షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, గ్లెన్ మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్ వంటి లెజెండరీ ఆసీస్ ప్లేయర్ల టీమ్‌లో సభ్యుడిగా ఉన్న జస్టిన్ లాంగర్, కోచ్‌గానూ సూపర్ సక్సెస్ అయ్యాడు... 

జస్టన్ లాంగర్‌తో కలిసి సక్సెస్‌ఫుల్ ఓపెనర్‌గా రాణించిన మాథ్యూ హేడెన్, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. పాక్ టీమ్‌కి హేడెన్ హెడ్ కోచ్ కావడంతో ఆస్ట్రేలియా టీమ్‌లోని కొందరు ప్లేయర్లు జస్టిన్ లాంగర్‌ కోచింగ్ స్టైల్‌పై ఆరోపణలు చేశారు...

సీనియర్ టెస్టు బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి ఆసీస్ జట్టు క్రికెటర్లతో జస్టిన్ లాంగర్‌కి మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఆసీస్ మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, సెక్స్ టెక్సింగ్ ఆరోపణలతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు జస్టిన్ లాంగర్ వ్యవహరించిన తీరుపై కూడా టీమ్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్ వినబడింది...

తాజాగా సడెన్‌గా జస్టిన్ లాంగర్, హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో ఈ వార్తలన్నీ నిజమేనని ఖరారు చేసినట్టైంది.  

భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన తర్వాత జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు, అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ‘ఎప్పుడూ ఇండియాని తక్కువ అంచనా వేయొద్దంటూ...’ జస్టన్ లాంగర్ చేసిన కామెంట్లు, టీమిండియా ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాయి... 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?