INDIA vs WestIndies : టీమిండియాలో కరోనా కలకలం.. ముగ్గురు క్రికెటర్ల‌కు పాజిటివ్, సిరీస్‌పై ఎఫెక్ట్..?

Siva Kodati |  
Published : Feb 02, 2022, 10:11 PM IST
INDIA vs WestIndies : టీమిండియాలో కరోనా కలకలం.. ముగ్గురు క్రికెటర్ల‌కు పాజిటివ్, సిరీస్‌పై ఎఫెక్ట్..?

సారాంశం

టీమిండియా (team india) క్రికెటర్లు కరోనా (coronavirus) బారినపడ్డారు. ప్రస్తుతం అహ్మాదాబాద్‌లో వున్న ఆటగాళ్లు, సిబ్బందిలో కొందరు కోవిడ్‌తో బాధపడుతున్నారు. శిఖర్ ధావన్ (shikhar dhawan), రుతురాజ్ గైక్వాడ్‌తో (ruturaj gaikwad) పాటు కొందరు  సిబ్బందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.

టీమిండియా (team india) క్రికెటర్లు కరోనా (coronavirus) బారినపడ్డారు. ప్రస్తుతం అహ్మాదాబాద్‌లో వున్న ఆటగాళ్లు, సిబ్బందిలో కొందరు కోవిడ్‌తో బాధపడుతున్నారు. శిఖర్ ధావన్ (shikhar dhawan), రుతురాజ్ గైక్వాడ్‌తో (ruturaj gaikwad) పాటు కొందరు  సిబ్బందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. విండీస్‌తో ఈ నెల 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే ఆటగాళ్లు బయో బబుల్‌లో వున్నారు. అయితే కొందరికి కరోనా సోకడంతో ప్రస్తుతం జట్టుకు సమస్యగా పరిణమించింది. 

ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్, వచ్చే నెలలో భారత్‌లో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే భారత్ టూర్‌లో వెస్టిండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు ఆడుతుంది...

ఇప్పటికే వెస్టిండీస్‌తో సిరీస్‌కి భారత జట్టు వన్డే, టీ20 జట్లను ప్రకటించగా... తాజాగా భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించింది విండీస్. సీనియర్ బౌలర్ కీమర్ రోచ్‌కి తిరిగి వన్డే జట్టులోకి పిలుపునిచ్చారు సెలక్టర్లు...

కిరన్ పోలార్డ్ కెప్టెన్సీలో భారత్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది విండీస్. టీ20 సిరీస్ ఆడే జట్టును శుక్రవారం (జనవరి 28న) ప్రకటించనుంది విండీస్ బోర్డు... కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీ20 సిరీస్‌ను కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా, వన్డే సిరీస్2ను అహ్మదాబాద్‌లోని మొతేరా నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించబోతున్నారు.

టీ20 సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, రవి భిష్ణోయ్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్...

వన్డే సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవిభిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్... 
 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !