గుండు చేయించుకున్న డేవిడ్ వార్నర్.. కోహ్లీ కూడా చేయాలంటూ..

By telugu news teamFirst Published Mar 31, 2020, 2:04 PM IST
Highlights

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆయన ఇటువంటి ఛాలెంజ్ విసిరాడు. వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతూ ఇలా షేవ్ చేసుకున్నానని చెప్పాడు.

కరోనా వైరస్ పై పోరుకు ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముందుకు వచ్చాడు. స్వయంగా గుండు చేసుకున్నాడు. తనలాగే గుండు చేసుకోవాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు సవాలు విసిరాడు. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆయన ఇటువంటి ఛాలెంజ్ విసిరాడు. వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతూ ఇలా షేవ్ చేసుకున్నానని చెప్పాడు.

Also Read లాక్ డౌన్.. బులెట్ కాఫీతో గుమగుమలాడిస్తున్న జాంటీ రోడ్స్...

ఇంట్లో గుండు చేసుకుంటూ తీసుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో సేవలు అందిస్తోన్న వారికి తన మద్దతు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నాడు. ఇలా గుండు చేసుకుంటూ వారికి మద్దతు తెలపాలని కోరాడు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా మృతుల సంఖ్య 19కి చేరింది. ఆ దేశంలో ఈ రోజు ఉదయం 8 గంటల నాటికి 4,460 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా...భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలు కూడా ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతుగా విరాళాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. భారత ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని, తమ చైనా సహాయం ఎంతోకొంతయినా సాటి భారతీయుల కష్టాలను తీర్చగలుగుతుందని ఆశిస్తున్నట్టు విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. 

ఇకపోతే.... రెండు రోజుల కింద విరాట్ కోహ్లీ కరోనా విషయం మీద ఒక వీడియో రిలీజ్ చేసాడు. లాక్‌డౌన్‌పై అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. కష్టకాలంలో దేశానికి అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మేల్కొని నడుచుకోవాలని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా మెలగాలి అభిమానులను కోరాడు విరాట్ కోహ్లీ. 

click me!