కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ కి కరోనా దెబ్బ!

By Sree sFirst Published Mar 20, 2020, 7:02 PM IST
Highlights

2020 లో విరాట్‌ ఫామ్‌లో లేకపోవటం..కరోనా వైరస్‌ కారణంగా కెప్టెన్‌ కోహ్లీకి నిరీక్షణ తప్పేటట్టు కనబడడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు బాదిన రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీ 71వ సెంచరీని బాది రికీ పాంటింగ్ సరసన చేరుదామని తహతహలాడుతుంటే.... పరిస్థితులు మాత్రం అనుకూలించేలా కనబడడం లేదు.

విరాట్‌ కోహ్లి, ఈ పేరు వింటేనే ఠక్కున గుర్తోచ్చేదిఒక పరుగుల యంత్రం... రన్ మెషిన్ గా బాగా పాపులర్ అయిన ఈ భారత కెప్టెన్ మైదానంలోకి దిగిన ప్రతిసారి పరుగుల వరదే! గ్రౌండ్ కి నలు వైపులా కండ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడడం కోహ్లీ నైజం. 

విరాట్ పేరు చెబితేనే... పరుగుల వర్షం కండ్ల ముందు కదులుతుంది. మైదానంలో దిగితే చాలు..బౌండరీలు..సిక్సర్ల మోతతో అభిమానుల్ని ఆకట్టుకుంటాడు. గత ఆరేండ్లుగా ప్రతి సంవత్సరం సెంచరీల మీద సెంచరీలు బాదేసేవాడు. 

Also read: కరోనా దెబ్బకు ప్రపంచంలో వాయిదాపడ్డ క్రీడలు ఇవే...

కానీ 2020 లో విరాట్‌ ఫామ్‌లో లేకపోవటం..కరోనా వైరస్‌ కారణంగా కెప్టెన్‌ కోహ్లీకి నిరీక్షణ తప్పేటట్టు కనబడడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు బాదిన రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీ 71వ సెంచరీని బాది రికీ పాంటింగ్ సరసన చేరుదామని తహతహలాడుతుంటే.... పరిస్థితులు మాత్రం అనుకూలించేలా కనబడడం లేదు. 

ప్రస్తుత పరిస్థితుల్లో మరి కొన్నాళ్ల పాటు విరాట్ కోహ్లీ ఓపిక పట్టక తప్పని పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన టెస్టులు, వన్డేలు...టీ..20 మ్యాచ్‌లు కలిపి కోహ్లి 16 ఇన్నింగులు మాత్రమే ఆడాడు. 

ఇందులో అత్యధిక స్కోరు 89. ఆస్ట్రేలియాతో బెంగళూరులో ఆడిన వన్డే మ్యాచ్‌లో ఆ పరుగులు సాధించాడు. 2010 తర్వాత కోహ్లి కెరీర్ లో మొదటిసారి ఏడాదిలో తొలి రెండు నెలలు గడిచినా... అంతర్జాతీయ క్రికెట్‌లో శతకానికి దూరంగా ఉన్నాడు. 

Also read: భారత్ లో కరోనా కలకలం... అభిమానులకు కోహ్లీ సూచనలివే

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్నాయి. శతకాల శతకాన్ని బాదాడు లిటిల్ మాస్టర్. 100 సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 

ఇక ఆ తరువాత స్థానంలో ఆసీస్ మాజీ సారథి రికి పాంటింగ్‌ ఉన్నాడు. 71 సెంచరీలు సాధించిన రికీ పాంటింగ్ ని చేరుకునేందుకు విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లి 70 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. 

ఈ సంవత్సరం మొత్తంగా 16 ఇన్నింగుల్లో కలిపి కోహ్లి 30.46 సగటుతో...  457 పరుగులు మాత్రమే చేశాడు. 

ఐపీఎల్‌ కన్నా ముందే దక్షిణాఫ్రికా సిరీస్ లోనే కోహ్లీ ఈ ఘనత సాధించేయాలని అనుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్ లోనే కోహ్లీ తన పూర్వపు ఫామ్ ని అందుకోవాలని ఉవ్విల్లూరాడు. 

కానీ విరాట్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ధర్మశాలలో మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా...  మిగతా రెండు మ్యాచులు కరోనా దెబ్బ కు అటకెక్కాయి. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు క్రీడాపోటీలన్నీ నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికి పాటింగ్‌ రికార్డును సమం చేయాలనుకున్నప్పటికీ...  కోహ్లీకి మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పేలా కనబడడం లేదు. 

click me!