అంతర్జాతీయ క్రికెట్లో కరోనా కలవరం... ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం

By Arun Kumar PFirst Published Mar 7, 2020, 6:07 PM IST
Highlights

ప్రపంచ  దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు క్రికెట్లోనూ కలకలం సృష్టిస్తోంది. దీని కారణంగా ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్ల మధ్య వివాదం చెలరేగుతోంది.  

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అంతర్జాతీయ క్రికెట్ పై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భయంలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానాలకు వచ్చే అభిమానులు గణనీయంగా తగ్గింది. దీంతో క్రికెట్ బోర్డ్ ల ఆదాయం తగ్గింది. ఇది చాలదనట్టు ఇప్పుడు ఆటగాళ్ల మధ్య కూడా చిచ్చు పెడుతోంది ఈ మహమ్మారి. 

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు సూచించింది. దీంతో త్వరలో చేపట్టనున్న శ్రీలంక పర్యటనలో ఆటగాళ్లతో కరచాలనం చేసేబదులు ఫిస్ట్ బంప్(పిడికిళ్లను మెళ్లిగా గుద్దుకోవడం) చేస్తామని ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జోరూట్ సోషల్ మీడియాలో సరదాగా కామెంట్ చేశారు. 

read more  టి20 ప్రపంచ కప్ ఫైనల్ : భారత పవర్ ప్లే వ్యూహం, ఆసీస్ భయమదే!

అయితే దీనిపై ఆసిస్ బౌలర్ మిచెల్ జాన్సన్ స్పందించిన తీరు వివాదానికి దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ లో జాన్సన్ ఇంగ్లాండ్‌ టీంతో పాటు ఆ జట్టు ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. 2017లో స్టోక్స్‌ ఒక క్లబ్‌ వద్ద గొడవపడిన విషయాన్ని గుర్తుచేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ''ఇంగ్లాండ్‌ మీరు ఫిస్ట్‌ బంప్‌ చేయొచ్చు కానీ స్టోక్స్‌తో జాగ్రత్తగా ఉండండి... అతడు గట్టిగా పంచ్‌లు విసురుతాడేమో'' అంటూ గతంలో స్టోక్స్ ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడాన్ని గుర్తుచేస్తూ ఎద్దేవా చేశాడు. 

ఈ కామెంట్స్ తో చిర్రెత్తిపోయిన  స్టోక్స్ కూడా అంతూ ధీటుగా జాన్సన్ కు సమాధానమిచ్చాడు. ఇంగ్లాండ్ జట్టు అభిమాన బృందం గతంలో జాన్సన్ ను  ఉద్దేశించి  పాడిన పాటకు సంబంధించిన లిరిక్స్ తో స్టోక్స్ ఓ ట్వీట్ చేశాడు. ఇలా కరోనా వైరస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య మాటల యుద్దానికి  కారణమైంది.  

read more  భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్‌కు నో ప్రాబ్లమ్: లీగ్ కమిటీ

 

click me!