Virat kohli: నా డాన్సును కాపీ కొట్టావ్.. కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ ఫన్నీ రిప్లై..

Published : Dec 16, 2021, 05:32 PM ISTUpdated : Dec 16, 2021, 05:34 PM IST
Virat kohli: నా డాన్సును కాపీ కొట్టావ్.. కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ ఫన్నీ రిప్లై..

సారాంశం

David Warner: ప్రపంచ క్రికెట్ లో సూపర్ స్టార్స్ గా వెలుగొందుతున్న ఇద్దరు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటున్నారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి.. టీమిండియా టెస్టు కెప్టెన్ పై కంప్లెయింట్ కూడా చేశాడు. 

సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ సంచలన స్టార్సే. ఆటకు సంబంధించి గానీ, కుటుంబ విషయాలపైన గానీ, ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేయాల్సి వచ్చినా వాళ్లు పోస్టులు పెడితే చాలు  సామాజిక మాధ్యమాలు మోతెక్కిపోతాయి. ఆ ఇద్దరే టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ ఇద్దరికీ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటే..? తాజాగా ఆ ముచ్చట కూడా తీరింది.  ఇటీవలే డేవిడ్ వార్నర్ పెట్టిన ఓ వీడియోకు కోహ్లీ  కామెంట్ చేయగా ఇప్పుడు ఆ వంతు సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కు వచ్చింది.

తన ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ.. డిజిట్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన  ఓ డాన్స్ వీడియోను పోస్టు చేశాడు. ఈ పోస్టు చేస్తూ.. ‘ఇది మళ్లీ డిజిట్ డాన్స్ చేయాల్సిన సమయం..’అని రాసుకొచ్చాడు. ఈ వీడియోకు వార్నర్ కామెంట్ చేస్తూ.. ‘నా డాన్స్ మూవ్మెంట్స్ ను కాపీ చేశావ్...’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు.

 

ఇప్పుడు ఈ వీడియోతో  పాటు డేవిడ్ వార్నర్ కామెంట్ కూడా వైరల్ అవుతున్నది. దీనికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ... ‘అతడు (విరాట్) ఎవరినీ కాపీ చేయడు, అందరూ అతడినే కాపీ కొడతారు..’ అని  కామెంట్ చేశారు. మరో  నెటిజన్ స్పందిస్తూ.. ‘రోహిత్ శర్మ కు ఇన్సూరెన్స్ ఇవ్వండి.. అతడికి దాంతో అవసరం ఉంటుంది..’ అని రాసుకొచ్చాడు. 

ఇదిలాఉండగా..   డేవిడ్ వార్నర్ ఇటీవలే ప్రముఖ తెలుగు హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని  ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అనే పాటకు  ఫేస్ యాప్ ద్వారా స్టెప్పులేశాడు.  ఈ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయగానే దీనికి కోహ్లీ కామెంట్ చేస్తూ... ‘మిత్రమా.. నువ్వు ఓకేనా..?’ అని కామెంట్ చేయగా.. దానికి వార్నర్ కూడా ‘కొంచెం గొంతు పట్టేసిందిగానీ అంతా ఓకే..’ అని రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి : వార్నర్.. డేవిడ్ వార్నర్! నీ అవ్వ తగ్గేదేలే..!! ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అంటున్న సన్ రైజర్స్ మాజీ కెప్టెన్

 

ఇక యాషెస్ సిరీస్ లో  అదరగొడుతున్న డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు రెండు సెంచరీలు మిస్ చేసుకున్నాడు.  గబ్బా టెస్టులో 94 పరుగుల వద్ద ఔట్ అయిన వార్నర్.. అడిలైడ్ లో  95 పరుగులు చేసి  నిష్క్రమించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !