మీకేం బానే ఉంటారు.. పోయింది భారత క్రికెట్ పరువు.. కోహ్లీ-గంగూలీ వివాదంపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Published : Dec 16, 2021, 03:58 PM IST
మీకేం బానే ఉంటారు.. పోయింది భారత క్రికెట్ పరువు.. కోహ్లీ-గంగూలీ వివాదంపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

Aakash Chopra On Virat kohli: దక్షిణాఫ్రికా పర్యటనకు  ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ నిర్వహించిన పాత్రికేయుల సమావేశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు దారితీసిన టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ  వివాదంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 కెప్టెన్సీ విషయంలో తననెవరూ సంపద్రించలేదని విరాట్ చెప్పగా... సారథ్య బాధ్యతల నుంచి వైదొలగొద్దని తాను కోహ్లీకి వ్యక్తిగతంగా చెప్పినట్టు నాలుగైదు రోజుల క్రితం గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..  ఈ వివాదంలో అసలు నష్టపోయింది భారత క్రికెట్ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చోప్రా మాట్లాడుతూ.. ‘ఇక్కడ ప్రశ్న అబద్దం ఎవరు చెబుతున్నారు.. ఎవరిది నిజం.. ఎవరు తప్పు అనేది కాదు..  సమస్య ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది...? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కాదు. ఈ  వివాదంలో వాస్తవంగా నష్టపోయింది భారత క్రికెట్...’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

‘నిజం కల్పన కన్నా బలంగా ఉంటుందని అంటారు. అది విన్నప్పుడు నేను నిజంగా  ఆశ్చర్యపోయాను. ప్రత్యేకించి ఈ విషయం (కోహ్లీ-బీసీసీఐ వివాదం) లో కూడా అచ్చంగా అదే జరిగింది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం తాను విరామం కోరలేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. కానీ రోహిత్ శర్మ సారథి గా ఎంపికయ్యాక అతడి కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకే కోహ్లీ.. వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.  ఇది సమాచార లోపం వల్లే జరిగింది. అయితే ఇవన్నీ (పుకార్లు) పుట్టిస్తున్నది ఎవరు..? ఎందుకోసం చేస్తున్నారనేది ఏమీ అర్థం కావడం లేదు...?’అని తెలిపాడు. 

 

ఇంకా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘టీ20 కెప్టెన్ గా వైదొలిగే సమయంలో  తాను వన్డే, టెస్టు కెప్టెన్ గా కొనసాగుతానని బీసీసీఐ తో చెప్పినట్టు తెలిపాడు. కెప్టెన్సీ అనేది హక్కు కాదు.. అదొక గౌరవం...’ అని పేర్కొన్నాడు. 

Also Read : వాళ్లు నీ అంత క్రికెట్ ఆడకపోవచ్చు.. కానీ కెప్టెన్సీ నిర్ణయం వాళ్లదే.. కోహ్లీ వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్

రెండేండ్లుగా మొత్తుకుంటున్నా నమ్మరేంట్రా బాబు? హిట్ మ్యాన్ తో విభేదాలపై కోహ్లీ క్రిస్టల్ క్లీయర్ రిప్లై

ఇక ఇదే విషయమై క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ-గంగూలీ వివాదంలో..  విరాట్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీసీసీఐ మీదికంటే దాని చీఫ్ మీదే ఎక్కువగా ఉందని సన్నీ అన్నాడు.  ఇక కపిల్ దేవ్ మాట్లాడుతూ... ఎంత పెద్ద క్రికెటర్ అయినా కెప్టెన్ విషయంలో నిర్ణయం తీసుకునేది సెలెక్టర్లే అని కోహ్లీకి చురకలంటించాడు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించి  దక్షిణాఫ్రికా పర్యటన మీద దృష్టి పెట్టాలని విరాట్ కు హిత బోధ చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !