
భారత క్రికెట్ జట్టులో ‘నయా వాల్’గా గుర్తింపు పొందిన ఛటేశ్వర్ పుజారా టెస్టులలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో ఢిల్లీ వేదికగా జరుగబోయే టెస్టు పుజారా కెరీర్ లో వందో టెస్టు. ఇటీవలే నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టు పుజారా కెరీర్ లో 99వ టెస్టు.
2010 లో భారత క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన పుజారా.. ఇప్పటివరకు 99 టెస్టులలో 7,021 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి బ్యాటింగ్ సగటు 44.16గా ఉంది. పుజారా కెరీర్ లో 19 సెంచరీలు 34 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 206 నాటౌట్ గా ఉంది.
శుక్రవారం మొదలుకాబోయే ఢిల్లీ టెస్టుతో వందో టెస్టు ఆడబోతున్న పుజారాకు ముందు భారత క్రికెట్ జట్టు తరఫున వంద టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాను ఓసారి చూద్దాం.
1. సచిన్ టెండూల్కర్ : 200 టెస్టులు.. 15,921 పరుగులు
2. రాహుల్ ద్రావిడ్ : 163 టెస్టులు.. 13,265
3. వీవీఎస్ లక్ష్మణ్ : 134 టెస్టులు.. 8,781
4. అనిల్ కుంబ్లే : 132 టెస్టులు.. 619 వికెట్లు
5. కపిల్ దేవ్ : 131 టెస్టులు.. 434 వికెట్లు
6. సునీల్ గవాస్కర్ : 125 టెస్టులు.. 10,122 రన్స్
7. దిలీప్ వెంగ్‌సర్కార్ : 116 టెస్టులు.. 6,868 రన్స్
8. సౌరవ్ గంగూలీ : 113 టెస్టులు.. 7,212
9. విరాట్ కోహ్లీ : 105 టెస్టులు.. 8,131
10. ఇషాంత్ శర్మ : 104 టెస్టులు.. 311 వికెట్లు
11. హర్భజన్ సింగ్ : 103 టెస్టులు.. 417 వికెట్లు
12. వీరేంద్ర సెహ్వాగ్ : 103 టెస్టులు.. 8,503 పరుగులు
- ఢిల్లీ టెస్టుతో పుజారా కూడా ఈ ఘనతను దక్కించుకోబోతున్నాడు. భారత క్రికెట్ లో గత దశాబ్దంలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడిన ఈ ‘నయా వాల్’ వందో టెస్టులో ఎలా ఆడతాడో చూడాలి.