IPL 2021 CSK vs RCB: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీలో రెండు మార్పులు

Published : Sep 24, 2021, 07:55 PM ISTUpdated : Sep 24, 2021, 07:57 PM IST
IPL 2021 CSK vs RCB: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీలో రెండు మార్పులు

సారాంశం

IPL 2021: ఐపీఎల్ 14 వ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. 

ఐపీఎల్ లో రెండు అగ్రశ్రేణి జట్లైన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఇసుక తుఫాను కారణంగా టాస్ అరగంట ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కానీ కాసేపటి తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం స్టేడియంలోకి రాగానే  క్రికెట్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, ముంబయి మ్యాచ్ లో గాయమైన చెన్నై బ్యాట్స్మెన్ అంబటి రాయుడు  ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు.  కానీ ఆర్సీబీ జట్టులో సచిన్ బేబి స్థానంలో నవదీప్ సైనీ, టిమ్ డేవిడ్ స్థానంలో కైల్ జమిన్సన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

వీళ్లే లచ్చిందేవి వారసులు.. ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ లిస్టు ఇదిగో
RCB అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా !