IPL 2021: స్టేడియమంతా ‘సచిన్.. సచిన్’ అని అరుపులు.. రోహిత్‌ శర్మకు డిస్టర్బ్

By telugu teamFirst Published Sep 24, 2021, 6:46 PM IST
Highlights

ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ల మధ్య అబుదాబీలోని స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత సచిన్ టెండూల్కర్ స్టేడియంలో అడుగుపెట్టారు. కోల్‌కతా ప్లేయర్లను అభినందించడానికి ఆయన స్టేడియంలోకి వెళ్లగానే ప్రేక్షకులంతా సచిన్.. సచిన్.. అంటూ జపించారు. కరోనా కారణంగా తక్కువ మందే మ్యాచ్ చూడటానికి వచ్చినా వారి అరుపులతో సచిన్ పేరు స్టేడియమంతా మార్మోగిపోయింది.

క్రికెట్(Cricket) అభిమానులు సచిన్ టెండూల్కర్‌ను(Sachin Tendulkar) క్రికెట్ దేవుడిగా ఆరాదిస్తుంటారు. భారత్ సహా విదేశాల్లోనూ ఆయనకున్న పాపులారిటీ చాలా ఎక్కువ. బయట ఎక్కడో కనిపించడం కంటే ఆయన స్టేడియంలో కనిపిస్తే అభిమానుల ఉత్సాహానికి హద్దులే ఉండవు. ఇలాంటి ఎపిసోడ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగింది. ఐపీఎల్(IPL) రెండో దశలో భాగంగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు ఈ అవకాశం చిక్కింది.

ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్టేడియంలో అడుగుపెట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ సభ్యులను అభినందించడానికి ఆయన స్టేడియంలోకి వెళ్లారు. ఆయనలా అడుగుపెట్టాడో లేదో అభిమానులంతా సచిన్.. సచిన్.. అంటూ అరుస్టూ సంబురాలు చేసుకున్నారు. కరోనా కారణంగా మ్యాచ్ చూడటానికి వచ్చిన వారి సంఖ్య తక్కువే ఉన్నా.. సచిన్ పిలుపులతో స్టేడియం మార్మోగిపోయింది.

మరోవైపు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెరెమనీలో ముంబయి ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్నారు. స్టేడియమంతా సచిన్.. సచిన్ అనే ధ్వనిస్తుండటంతో రోహిత్ శర్మ తన ప్రసంగాన్ని కొద్ది సేపు నిలుపుకోవాల్సి వచ్చింది. సచిన్ పేరు మార్మోగిన తర్వాత కొంత శాంతించగానే మళ్లీ ఆయన మాట్లాడటం కొనసాగించారు.

స్టేడియంలోకి వెళ్లిన సచిన్ టెండూల్కర్ కోల్‌కతా ప్లేయర్‌లకు అభినందనలు చెప్పారు. హర్భజన్ సింగ్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ కనిపించారు.

సచిన్ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఇలాంటి అరుపులు రావడం ఇదే తొలిసారేమీ కాదు. ఆయన క్రికెట్ ఆడుతున్న కాలంలోనూ స్టేడియంలోకి వెళ్లగానే అభిమానులు ఇలా వేడుక చేసుకునేవారు. వారిద్దరూ మాట్లాడుతున్న ఫొటోనూ ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ ఖాతా పోస్టు చేసింది.

click me!