డాటర్స్ డే కు సీఎస్కే ప్రత్యేక పోస్ట్.. వైరల్ అవుతున్న వీడియో

By Srinivas MFirst Published Sep 26, 2022, 10:38 AM IST
Highlights

Daughter's Day:  ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న ‘డాటర్స్ డే’ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ సీఎస్కే కూడా ఆసక్తికర వీడియో షేర్ చేసింది. 

డాటర్స్ డే ను పురస్కరించుకుని చెన్నై సూపర్ కింగ్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో  ఓ ఆసక్తిర వీడియోను పోస్ట్  చేసింది. ‘డాడీస్ గ్యాంగ్’గా పేరున్న సీఎస్కే లో  ఇప్పుడు ఆడుతున్న, ఇటీవలే రిటైరైన పలువురు ఆటగాళ్లంతా  డాడీలే. వీరిలో చాలా మందికి తొలి సంతానం కూతురే కావడం గమనార్హం. ధోని, రైనా, జడేజా, రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ, డ్వేన్ బ్రావో వంటి దిగ్గజ ఆటగాళ్లందరి ఇంట్లో ‘మహాలక్ష్మీ’లు ఉన్నారు. ఈ సందర్బంగా సీఎస్కే..  ఆసక్తికర వీడియోను  పోస్ట్ చేసింది. 

వీడియోలో పైన పేర్కొన్న ఆటగాళ్లు తమ కూతుళ్లతో ఉన్న ఫోటోలతో ఆనందమైన క్షణాలను పంచుకుంటున్న ఫోటోలతో కలిపి ఓ  కొలేజ్ ను రెడీ చేసింది. ధోని కూతురు జీవాతో  మొదలైన ఈ వీడియోలో తర్వాత  జడేజా, ఊతప్ప, బ్రావో, మోయిన్ అలీలు తమ కూతుళ్లతో ఉన్న ఫోటోలను కలిపి వీడియో రూపొందించారు. 

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.  సీఎస్కే తన ఇన్స్టా ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగానే లైకులు, కామెంట్స్ తో  నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు.  పోస్టు కింద ఓ నెటిజన్.. ‘లాట్స్ ఆఫ్ లవ్ అవర్ యెల్లో ఫ్యామిలీ’ అని రాయగా.. ‘యెల్లో (సీఎస్కే జెర్సీ కలర్) అనేది  ఒక క్రికెట్ టీమ్ మాత్రమే కాదు. అది ఒక కుటుంబం, ఐ లవ్ సీఎస్కే’ అని కామెంట్స్ చేశాడు. 

 

ఇదిలాఉండగా ఈ ఏడాది అయినా ధోనిని చెన్నై చెపాక్ స్టేడియంలో చూడాలనుకుంటున్న తమిళ తంబీల కోరిక నెరవేరనున్నది. బీసీసీఐ ఇటీవలే.. వచ్చే ఐపీఎల్ ను సొంత, బయిటి గ్రౌండ్ లలో నిర్వహిస్తామని తేల్చిన విషయం తెలిసిందే. దీంతో  వచ్చే సీజన్ లో ధోని ఆటను చెపాక్ లో ఎంజాయ్ చేయొచ్చని తమిళ అభిమానులు  భావిస్తున్నారు.   కరోనా కారణంగా 2020 నుంచి కొన్ని ఎంపిక చేసిన స్టేడియాలలో మాత్రమే ఐపీఎల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.   

ఇక వచ్చే సీజన్ లో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. సీఎస్కేతో ఆడతాడా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది.  గత సీజన్ లో అతడిని  కెప్టెన్ గా నియమించి తర్వాత తీసేయడంతో జడ్డూ-సీఎస్కే యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.  2023 సీజన్ కోసం ఈ ఏడాది డిసెంబర్ 16న జరగాల్సి ఉన్న  ఐపీఎల్ వేలంలో జడేజా పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. అయితే దీనిపై సీఎస్కే మాత్రం  అవన్నీ పుకార్లే అని కొట్టిపారేస్తున్నది. 

click me!