IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) ఐపీఎల్ 2024 ఆటగాళ్ల వేలంలో వరల్డ్ కప్ హీరో, కీవీస్ ప్లేయర్ రచిన్ రవీంద్రను దక్కించుకుంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి ఎడిషన్ అయిన ఐపీఎల్ 2024 ట్రోఫీని ఎంఎస్ ధోనీ నాయకత్వంలో గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Chennai Super Kings XI IPL 2024: దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో మంగళవారం ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బిడ్డింగ్‌లో ఆరుగురు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో వరల్డ్ కప్ హీరో రచిన్ రవీంద్ర, మరో కీవీస్ ప్లేయర్ డారిల్ మిచెల్ లు ఉన్నారు. అలాగే, భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్లతో దక్కించుకుంది. దీంతో ఆల్ రౌండర్లు, బ్యాటర్స్, బౌలింగ్ విభాగం సమతూకంతో ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బలమైన జట్టుగా కనిపిస్తోంది. ధోని నాయకత్వంలోని సీఎస్కే ఈ సారి కూడా ఐపీఎల్ 2024 ట్రోఫీని గెలుచుకోవాలనీ, దానికి తగ్గట్టుగా జట్టును తయారు చేసుకుంటోంది.
చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2024 జట్టులోని 11మంది ఆటగాళ్లు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర/మిచెల్ సాంట్నర్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (c) (wk) , రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మతీషా పతిరానా/ముస్తాఫిజుర్ రెహమాన్ లు.
undefined
ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే..: రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు), అవనీష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు).
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 స్క్వాడ్ కంపోజిషన్:
వికెట్ కీపర్లు: ఎంఎస్ ధోని, డెవాన్ కాన్వే , అవనీష్ రావు అరవెల్లి.
బ్యాటర్స్: రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, అజింక్యా రహానే, సమీర్ రిజ్వీ.
ఆల్ రౌండర్లు: మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, అజయ్ మండల్, నిశాంత్ సింధు, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శార్దూల్ ఠాకూర్.
బౌలర్లు: దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ చౌదరి.