నాలుగో స్థానంలో ధోనినే అత్యుత్తమం...: ఫ్లెమింగ్

By Arun Kumar PFirst Published Mar 21, 2019, 3:10 PM IST
Highlights

మరో రెండు రోజుల్లో ఇండియాలో అతిపెద్ద క్రీడా సంబరానికి తెరలేవనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 సీజన్ లో భాగంగా ఈ నెల 23న ఆరంభ మ్యాచ్ చెన్నైసూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఈ టోర్నీని విజయంతో ఘనంగా ఆరంభించాలని భావిస్తున్న ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ జట్టు గెలుపు కోసం గతేడాది అనుసరించిన వ్యూహాన్నే ఈ ఐపిఎల్ సీజన్లో కూడా అమలుచేయనున్నట్లు చెన్నై ప్రధాన కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. 
 
చెన్నై సూపర కింగ్స్ జట్టు సారథిగానే కాకుండా బ్యాటింగ్ లో మిడిల్ ఆర్ఢర్ బాధ్యతలను కూడా మహేంద్ర సింగ్ ధోని తన భుజాన వేసుకున్నాడని ఫ్లెమింగ్ గుర్తుచేశాడు. ఇలా జట్టును మరపురాని మరో టైటిల్ విజయాన్ని అంధించడంలో ధోని కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. గత  ఐపీఎల్ లో ధోని నాలుగో స్థానంలో బరిలోకి దిగి  అద్భుతంగా రాణించాడని...అందువల్లే ఈసారి కూడా అతన్ని అదే స్థానంలో బరిలోకి దించనున్నట్లు ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. 

గతేడాది గాయం కారణంగా ఐపిఎల్ కు దూరమైన కేదార్ జాదవ్ ప్రస్తుతం జట్టులోకి రావడంతో ఈ నాలుగో స్థానంపై ఫోటీ నెలకొంది. అయితే ఈ స్థానంలో ఎవరు బరిలోకి దిగనున్నారన్న దానిపై అభిమానుల్లో సంధిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుంటాయని అన్నారు. మిగతా అన్నింట్లోనూ ధోని నాలుగో స్థానంలో బరిలోకి  దిగనున్నట్లు ఫ్లెమింగ్ వెల్లడించాడు. 

కేదార్ జాదవ్ రాకతో చెన్నై మిడిల్ ఆర్డర్ మరింత బలపడిందని పేర్కొన్నాడు. జాదవ్ తో పాటు ధోని కూడా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ కు దిగి రాణించగలరని ఫ్లెమింగ్ ప్రశంసించాడు.
 
click me!