చెన్నై-బెంగళూరు మ్యాచ్ ఆదాయం... పుల్వామా జవాన్లకు విరాళం

By Siva KodatiFirst Published Mar 21, 2019, 2:28 PM IST
Highlights

గత నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి దేశం మొత్తం ముందుకొస్తోంది. ఇప్పటికే పలు స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు జవాన్ల కోసం విరాళాలు ఇస్తూనే ఉన్నారు. 

గత నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి దేశం మొత్తం ముందుకొస్తోంది. ఇప్పటికే పలు స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు జవాన్ల కోసం విరాళాలు ఇస్తూనే ఉన్నారు.

తాజాగా ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నైలో జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని వీర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సూపర్‌కింగ్స్ ప్రకటించింది.

ఐపీఎల్ తొలి మ్యాచ్ కావడంతో పాటు ధోని, కోహ్లలు కెప్టెన్లుగా ఉండటంతో ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టిన రోజే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

ఇంతకుముందు కూడా వీర జవాన్ల కోసం టీమిండియా తన దాతృత్వాన్ని చూపింది. కొద్దిరోజుల ముందు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో ఆటగాళ్లకు వచ్చే ఫీజు మొత్తాన్ని అమరజవాన్ల కుటుంబాలకు ఇస్తున్నట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రకటించాడు. 

click me!