
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సర్వంసిద్ధమైంది. ఆదివారం మార్చి 9న భారత్ vs న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద అందరి కళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో కోహ్ల పెద్ద హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పెద్ద రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో ఇప్పటివరకు ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గేల్. కానీ కోహ్లీ ఆ రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 746 రన్స్ చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఈ సంవత్సరం పాకిస్తాన్ మీద సెంచరీ కొట్టాడు. ఇప్పుడు అతను ఈ ఫైనల్‌లో 45 రన్స్ చేస్తే వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ అవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో క్రిస్ గేల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో క్రిస్ గేల్ 17 మ్యాచ్‌లలో 791 రన్స్ చేశాడు. అందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ క్రిస్ గేల్. రన్స్ పరంగా విరాట్ కోహ్లీ అతనికంటే ముందుండవచ్చు. కోహ్లీకి ఇది ఒకే ఒక ఛాన్స్. ఎందుకంటే నెక్స్ట్ టోర్నమెంట్ వరకు అతను ఆడటం కష్టం.
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ రన్స్ చేసిన వారిలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 4 మ్యాచ్‌లలో 217 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. మొదటి స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ 226, న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 226 పరుగులతో ఉన్నాడు. మూడో స్థానంలో జో రూట్ వుండగా, అతను 225 రన్స్ చేశారు. అయితే, ఇప్పుడు బెన్ డకెట్, జో రూట్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో లేరు. దీంతో ప్రస్త్తుతం భావరత రన్ మిషన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రకు మధ్య పోటీ ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే, న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడు. సచిన్ టెండూల్కర్ 41 ఇన్నింగ్స్‌లలో 1,760 పరుగులు చేశాడు, వాటిలో ఐదు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 32 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఆరు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు సహా 1,656 పరుగులు చేశాడు. అయితే, మొత్తంగా అగ్రస్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 50 ఇన్నింగ్స్‌లలో 1,971 పరుగులు చేశాడు, ఇందులో ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
IPL 2025: కోహ్లీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తారా? ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
IND vs NZ Final మ్యాచ్‌కు గ్రౌండ్ రెడీ - ఇండియా, పాక్ ఆడిన గ్రౌండేనా? పిచ్ ఎలా వుండనుంది?