ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ తో మ‌రో ఛాంపియ‌న్ ఢీ.. బుమ్రా ముందు కోహ్లీ.. !

By Mahesh RajamoniFirst Published Apr 11, 2024, 9:18 PM IST
Highlights

Virat kohli vs Jasprit Bumrah : ఐపీఎల్ 2024 లో విరాట్ కోహ్లీ సూప‌ర్ ఫామ్ తో అద‌ర‌గొడుతున్నారు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్న కోహ్లీ.. ముంబ‌యితో జ‌రిగిన మ్యాచ్ లో మ‌రోసారి బుమ్రా మాయ‌లో ప‌డ్డాడు. 
 

Virat Kohli - Jasprit Bumrah : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌లూరు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 సీజ‌న్ లోనూ మంచి ఫామ్ లో ఉన్నాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అద‌ర‌గొడుతున్నాడు. ఆర్సీబీ బ్యాట‌ర్స్ వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్నా ఈ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా లీడ్ లో కొన‌సాగుతున్నాడు. అయితే, ఈ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ ను మ‌రో ఛాపింయ‌న్ ఢీ కొడితే.. అదిరిపోతుంది  క‌దా.. ! అది కూడా ఒకే టీమ్ లో.. జాతీయ జ‌ట్టుకు ఆడిన ప్లేయ‌ర్ బౌలింగ్ ను ఎదుర్కొంటే.. ! ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఆస‌క్తి క‌రంగా ఉంది క‌దా.. ! 

స‌రిగ్గా ఇదే జ‌రిగింది. ఐపీఎల్ పుణ్య‌మా అని కొత్త ప్లేయ‌ర్లు అవ‌కాశాలు రావ‌డమే కాదు.. జాతీయ జ‌ట్టుకు ఆడిన ఛాంపియ‌న్ ప్లేయ‌ర్లు ప్ర‌త్య‌ర్థులుగా బ్యాటింగ్-బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ క్రికెట్ ల‌వ‌ర్స్ కు మ‌స్తు మ‌జా అందిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ-జ‌స్ప్రీత్ బుమ్రాలు త‌ల‌ప‌డితే.. ఫ్యాన్స్ పండ‌గే.. ! వీరిద్ద‌రూ త‌ల‌ప‌డిన ప్ర‌తిసారి పోరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ బ్యాటింగ్ స‌మ‌యంలో బుమ్రా బౌలింగ్ చేశాడు.. అయితే, ఇద్ద‌రు ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ల గేమ్ ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని భావించారు. కానీ, విరాట్ కోహ్లీ ఎక్కువసేపు బుమ్రాను ఎదుర్కొన‌లేక‌పోయాడు. 

రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ ఆడతాడా? భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?

కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. ప్రపంచ ప్రమాదకర బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా కోహ్లీ మ‌రోసారి త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో పెవిలియ‌న్ కు న‌డిపించాడు. కోహ్లీని బుమ్రా ఔట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. బుమ్రా ముందు కోహ్లీ బ్యాట్ పెద్ద‌గా రాణించ‌లేదు. ఐపీఎల్లో బుమ్రాకు కోహ్లీ బలైపోవడం ఇది ఐదోసారి. ఐపీఎల్లో బుమ్రా 95 బంతులు ఆడి కోహ్లీ కేవ‌లం 140 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో తొలి వికెట్ కూడా కోహ్లీని బుమ్రా ఔట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ టోర్నీలో కోహ్లీని ఔట్ చేయడం ద్వారా బుమ్రా 100 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. మొత్తంగా వీరిద్ద‌రూ 16 సార్లు త‌ల‌ప‌డ‌గా, 5 సార్లు విరాట్ ను పెవిలియ‌న్ కు పంపాడు.

IPL 2024 : బుర్ర పెట్టాడు క్యాచ్ పట్టాడు.. యాక్షన్ అదిరిపోయింది.. !

click me!