Vijay Shankar Amazing Catch : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 24వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు విజయ్ శంకర్. తన అద్భుతమైన క్యాచ్ తో జోరుమీదున్న రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపిన ఆ అద్భుత క్యాచ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
IPL 2024 - Vijay Shankar : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్థాన్ రాయల్స్ కు షాకిచ్చాడు రషీద్ ఖాన్. చిరలో అద్భుతమైన ఇన్నింగ్స్ తో చివరి బంతివరకు సాగిన మ్యాచ్ లో గుజరాత్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఐపీఎల్ 2024 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల టార్గెట్ ను ఉంచగా, చివరిబంతికి గుజరాత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే, ఈ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ తో అదరగొట్టాడు గుజరాత్ ప్లేయర్ విజయ్ శంకర్. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన తొలి రెండు వికెట్ల తర్వాత సంజూ శాంసన్, రియాన్ పరాగ్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు గుజరాత్ ఫీల్డర్లు ఒకరి తర్వాత ఒకరు పలు తప్పిదాలు చేశారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో విజయ్ శంకర్ అద్భుతమైన క్యాచ్ తో అదరగొట్టాడు. రాజస్థాన్ తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో మోహిత్ శర్మ బౌలింగ్ భారీ షాట్ కొట్టాడు.
ముగ్గురు మోనగాళ్లు.. టీ20 వరల్డ్ కప్ 2024 భారత జట్టులో వీరు ఉండాల్సిందే.. !
అయితే, అది బౌండరీలైన్ వద్ద విజయ్ శంకర్ కు అద్భుతమైన క్యాచ్ తో రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపాడు. షాట్ ఆడిన ఆ బంతి నేరుగా విజయ్ చేతిలోకి వచ్చింది, కానీ బౌండరీ లైన్ వద్ద ఉండటంతో నియంత్రణ కోల్పోయాడు. అయితే, విజయ్ అద్భుతమైన ఆలోచనతో వెంటనే స్పందిస్తూ పట్టుకున్న బంతిని బౌండరీ లైన్ లోకి వెళ్తేముందు గాల్లోకి విసిరాడు. ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ నుంచి బయటకు వచ్చి బంతిని పట్టుకున్నాడు. అద్భుతమైన విజయ్ శంకర్ స్పందన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
A solid catch puts an an end to a splendid innings!
Riyan Parag departs for 76 courtesy of Vijay Shankar's outfield brilliance 👏👏
Watch the match LIVE on and 💻📱 | pic.twitter.com/F0h4bF27pl
GT VS RR HIGHLIGHTS : చివరి బంతికి గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ.. రషీద్ ఖాన్ రఫ్ఫాడించాడు.. !