WTC Final:ఇదంతా తుఫాను కి ముందు ప్రశాంతత..!

Published : Jun 18, 2021, 11:40 AM IST
WTC Final:ఇదంతా తుఫాను కి ముందు ప్రశాంతత..!

సారాంశం

విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఛటేశ్వర పుజారా వరకు అందరూ తెలుపు రంగు జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC)లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.  కాగా... ఈ ఛాంపియన్ షిప్ లో భాగంగా రెండు జట్ల సభ్యులు.. తాజాగా ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఛటేశ్వర పుజారా వరకు అందరూ తెలుపు రంగు జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.  దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేయగా.. అది అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆ వీడియోలో విరాట్ కోహ్లీ, పుజారా తెలుపు రంగు జెర్సీలో కనిపించారు. కాగా.. ఇషాంత్ శర్మను చూస్తూ.. మయాంక్ అగర్వాల్ విపరీతంగా నవ్వుతున్నట్లుగా ఆ వీడియోలో కనపడింది. ఫోటో షూట్ కి ముందు జరిగిన సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఇది కావడం గమనార్హం.

వీరిని చూస్తుంటే...  తుఫాను కి ముందు ప్రశాంతాత లా కనిపిస్తోంది.  కాగా... ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే రెండు జట్ల సభ్యులు ఇంగ్లాండ్ చేరుకున్నాయి.

ఇంగ్లాండ్ లో విరాట్ కోహ్లీకి బెస్ట్ రికార్డులు ఉన్నాయి. 2018 సిరీస్ లో రెండు టెస్ట్ సెంచరీలు చేసిన ఘనత కోహ్లీది. కాగా.. ఈ టెస్టు సిరీస్ లో ఎవరు విజయం  సాధిస్తారోనని అభిమానలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్