నవ్వుతూనే అక్తర్‌కు 90 ఎంఎం రాడ్ దింపిన అఫ్రిది.. ‘బాబర్‌పై బ్రాండ్’ వ్యాఖ్యలకు కౌంటర్

By Srinivas MFirst Published Mar 16, 2023, 7:55 PM IST
Highlights

LLC: తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా  పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్  బాబర్ ఆజమ్ పై నిత్యం ఏదో ఒక విమర్శ చేసే షోయభ్ అక్తర్ కు ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.   

ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి  బాబర్ ఆజమ్ పై వరుసగా విమర్శలు చేస్తూ  వార్తల్లో నిలుస్తున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయభ్ అక్తర్ కు  ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్  స్ట్రాంగ్  కౌంటర్ ఇచ్చాడు. బాబర్ కు ఇంగ్లీష్ రాదని, అందుకే బ్రాండ్స్ అతడి వెంటపడయని విమర్శించిన అక్తర్ కు  నవ్వుతూనే చురకలంటించాడు.  పాకిస్తాన్ ఆర్థిక మంత్రిని తప్పించి  అక్తర్ ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలని  తద్వారా అతడు  దేశానికి ‘బ్రాండ్’లను తీసుకొస్తాడని   వ్యాఖ్యానించాడు.

లెజెంట్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో భాగంగా దోహాలో ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లను  అక్తర్ తన   యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అక్తర్ తో పాటు సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది,   మిస్బా ఉల్ హక్ లు పాల్గొన్నారు.  

చర్చలో భాగంగా తాము ఆడినప్పటి జ్ఞాపకాలు, లెజెండ్స్ లీగ్ ముచ్చట్లు, ఇతర విషయాలను   గుర్తు చేసుకుంటున్న క్రమంలో అఫ్రిది.. అక్తర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.  ‘నేను మీకు చెబుతున్నా. ఇషాక్ దార్  (పాకిస్తాన్ ఫైనాన్స్ మినస్టర్) సాబ్ స్థానంలో అక్తర్ ను   నియమించండి. అక్తర్ కు బ్రాండ్ లను ఎలా నిర్మించాలో.. వాటిని ఎలా తయారుచేయాలో బాగా తెలుసు.    అక్తర్ బ్రాండ్స్ ను తయారుచేస్తాడు..’అని అన్నాడు. దీంతో అక్తర్ తో పాటు అక్కడున్న మిస్బా, తన్వీర్ ల  మోములు నవ్వులతో విరబూశాయి.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

కాగా క్రికెట్ లో  విరాట్ కోహ్లీ, ఇతర క్రికెటర్ల మాదిరిగా బాబర్  వెంట బ్రాండ్స్ పడకపోవడానికి అతడికి ఇంగ్లీష్ సరిగా రాకపోవడంతో పాటు కమ్యూనికేషన్  సమస్యలు కూడా ఉన్నాయని కొద్దిరోజుల క్రితం బాబర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  దీనిపై  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చీఫ్ రమీజ్ రాజా  కూడా అక్తర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. బ్రాండింగ్ అనేది  కంపెనీలను బట్టి రాదని..  ముందు మనిషిగా మారితే చాలని అక్తర్ కు చురకలంటించాడు. 

 

కాగా ఎల్ఎల్‌సీలో భాగంగా   ఆసియా లయన్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న షాహిద్ అఫ్రిది టీమ్  మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలిచింది. గౌతం గంభీర్ సారథ్యంలోని  ఇండియా మహారాజాస్ తో  రెండు  మ్యాచ్ లు ఆడిన  ఆసియా లయన్స్.. ఓ మ్యాచ్ లో గెలిచి మరోదాంట్లో ఓడింది.   వరల్డ్ జెయింట్స్ తో మ్యాచ్ లో కూడా గెలిచింది.  నేడు  వరల్డ్ జెయింట్స్ తో ఆడనుంది.  

click me!