వెస్టిండీస్ మాజీ క్రికెటర్ లారాకి అస్వస్థత

Published : Jun 25, 2019, 03:36 PM IST
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ లారాకి అస్వస్థత

సారాంశం

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబయిలోని పరేల్ ప్రాంతంలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. 

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబయిలోని పరేల్ ప్రాంతంలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఒక హోటల్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా... అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వన్డే వరల్డ్‌కప్‌లో లారా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాల్లో మరికొంత మంది క్రికెటర్లతో లారా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న లారా అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !