
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జోరుగా సాగుతున్నాయి. తమ జట్టు గెలవాలని ప్రతి ఒక్క అభిమాని ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన జట్టు ఆటను వీక్షించేందుకు చాలా మంది... స్టేడియంలకు వస్తూ ఉంటారు. అయితే... ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన తల్లిదండ్రులతో కలిసి మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఓ బాలుడు.. చేతిలో ఉన్న ప్లకార్డ్ ఇఫ్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నిజానికి.. చాలా మంది అభిమానులు.. తమ ఫేవరేట్ క్రికెటర్ ని ఎంకరేజ్ చేయడం కోసం... వారి పేర్లతో ప్లకార్డులను తయారు చేసి... వాటిని పట్టుకుంటూ ఉంటారు. వారు నిజంగా.. ఫోర్, సిక్స్ కొట్టినప్పుడు... వాటిని పైకి ఎత్తి చూపిస్తూ.... మరింత ఉత్సాహపరుస్తూ ఉంటారు. తాజాగా.. ఓ బాలుడు కోహ్లీ కోసం ఓ ప్లకార్డు తయారు చేశాడు. అందులో కోహ్లీని ఫోర్, సిక్స్ కొట్టమని కాకుండా.... ఆయన కుమార్తెతో డేటింగ్ కి వెళ్లడానికి అనుమతి కోరడం గమనార్హం.
ఆ బాలుడు ప్లకార్డుపై ‘ విరాట్ అంకుల్... నేను మీ అమ్మాయి వామిక ను డేట్ కి తీసుకువెళ్లొచ్చా?’ అంటూ అడగడం గమనార్హం. ఈ బాలుడి ఫోటోలు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. చాలా మంది దీనిని ఫన్నీగా తీసుకున్నారు. అందుకే... హౌ క్యూట్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ కొందరు మాత్రం చాలా సీరియస్ అయ్యారు. అంత చిన్న పిల్లాడికి మీరు నేర్పుతున్నది అదా అంటూ... ఆ బాలుడి పేరెంట్స్ ని తిట్టిపోస్తున్నారు. సెలబ్రెటీలు అయితే మాత్రం... వారి పేర్లను, వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఇలా ప్రవర్తిస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.