Sunrisers Hyderabad: మార్చి 22 నుంచి మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ ను మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుంది.
Sunrisers Hyderabad - Wanindu Hasaranga: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. అతనే శ్రీలంక స్టార్ క్రికెటర్ వానిందు హసరంగా. మార్చి 22 నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ కూడా అప్పుడే ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్టుల సిరీస్‌కు శ్రీలంక జట్టును తాజాగా ప్రకటించింది. దీంతో అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశముంది.
ఇక్కడ విచిత్రమేమిటంటే గతేడాది టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని శ్రీలంక క్రికెట్ బోర్డు సెలక్ట్ చేసింది.వైట్ బాల్‌పై దృష్టి సారించడానికి గత సంవత్సరం, హసరంగా టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 7 నెలల తర్వాత అతను అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకుందని సమాచారం.
IPL 2024: రిషబ్ పంత్‌కి ఇది కష్టమే... సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ !
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో వనిందు హసరంగా సభ్యుడుగా ఉన్నాడు. డిసెంబర్‌లో జరిగిన వేలం సందర్భంగా హైదరాబాద్ జట్టు అతడిని రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. అయితే, జాతీయ జట్టు మ్యాచ్ ల కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. అటువంటి పరిస్థితిలో, హసరంగా రెండు వారాల తర్వాత మాత్రమే ఐపీఎల్ మ్యాచ్ లను ఆడే ఆవకాశముంది.
వైట్ బాల్ క్రికెట్‌లో హసరంగా శ్రీలంకకు ముఖ్యమైన స్పిన్నర్ కావచ్చు. కానీ టెస్టులో అతని స్పిన్ అద్భుతాలు చేయలేదు. 2020లో టెస్టు అరంగేట్రం చేసిన తర్వాత కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రిటైర్‌మెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లాంగ్ ఫార్మాట్‌లో నిలదొక్కుకోవడంలో సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.
IPL 2024: అదిరిపోయింది.. విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్‌ని చూశారా.. !