ఏమ‌య్యా ముంబై కెప్టెన్ ఇలా చేస్తున్నావేంది.. మ‌రో వివాదంలో హార్దిక్ పాండ్యా ! వీడియోలు వైరల్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 29, 2024, 5:46 PM IST

Hardik Pandya: క్రికెట్ ప్రపంచంలో లెజెండరీ ప్లేయర్ లసింత్ మలింగ తెలియని వారుండరు. అయితే, మలింగ తో ముంబై కెప్టెన్ హార్తిక్ పాండ్యా అమర్యాదగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది హాట్ టాపిక్ గా మారింది.   
 


Hardik Pandya - Lasith Malinga : 5 ఐపీఎల్ టైటిళ్ల‌ను అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించిన ముంబై ఇండియ‌న్స్ ఇటీవ‌ల హార్దిక్ పాండ్యాకు టీమ్ ప‌గ్గాలు అప్ప‌గించింది. దీంతో ముంబై టీమ్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో షాక్ ఇచ్చారు. ల‌క్ష‌ల మంది ముంబై అధికారిక అకౌంట్ల‌ను అన్ ఫాలో అయ్యారు. దీని త‌ర్వాత కూడా హార్దిక్ పాండ్యా పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు కానీ, పాండ్యా మాత్రం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇక ఐపీఎల్ ప్రారంభం అయిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ‌తో ఫీల్డింగ్ మార్పు విష‌యంలో న‌డుచుకున్న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓరేయ్ పిల్ల బ‌చ్చా.. నువ్ రోహిత్ శ‌ర్మ‌కు చెప్ప‌డ‌మేంది అంటూ పాండ్యాపై ట్రోల‌ర్స్ మీమ్స్ తో విరుచుకుప‌డ్డారు.

ఇక టీమ్ లో స్టార్ బౌల‌ర్లు ఉండ‌గా, వారి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోకుండా ప‌క్క‌న పెట్ట‌డం, దీంతో గెలిచే మ్యాచ్ ను ఓడిపోవ‌డంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై మాజీలు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ముంబై ఫ్యాన్స్ అయితే, హార్దిక్ కెప్టెన్సీ ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో అత‌న్ని దారుణంగా ట్రోల్స్ తో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి అనేక ప్ర‌భావాలో ఏమో గానీ, పాండ్యా కెప్టెన్సీ త‌ర్వాత ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో కూడా  ఇంత‌కుముందులా ప‌రిస్థితులు లేవ‌ని తాజాగా చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే హార్దిక్ పాండ్యా మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు.

Latest Videos

చాహ‌ల్ స్పిన్ మాయ‌.. కోపంతో రిగిలిపోయిన రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?

క్రికెట్ ప్రపంచంలో లెజెండరీ ప్లేయర్ లసింత్ మలింగ తెలియని వారుండరు. అయితే, మలింగ తో ముంబై కెప్టెన్ హార్తిక్ పాండ్యా అమర్యాదగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్-ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత హార్దిక్ పాండ్యాను ల‌సిత్ మ‌లింగ్ హ‌గ్ చేసుకోవ‌డానికి వ‌చ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా మ‌లింగ‌ను ప‌క్క‌కు తోసేశాడు. మ‌లింగ వెంట‌నే ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీంతో మ‌రోసారి ట్రోల‌ర్స్ పాండ్యాపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. సీనియ‌ర్ల పట్ల ఎలా ప్ర‌వ‌ర్తించాలో ముందుగా నేర్చుకో అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

 

Does Hardik Pandya kicked Lasith Malinga? His hands, face reaction same story.
Not a good way to treat legend like Lasith Malinga. pic.twitter.com/Yg5a5hNRTE

— Satya Prakash (@Satya_Prakash08)

మ‌రో వీడియోలో ల‌సిగ్ మ‌లింగ‌, కీర‌న్ పోలార్డ్ లు కూర్చొని వున్నారు. బ్యాటింగ్ వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్న హార్దిక్ పాండ్యా వాట‌ర్ బాటిల్ తో చేతులో క‌డుక్కోవ‌డం, ఈ క్ర‌మంలోనే మ‌లింగ్ కూర్చో అనే సైగ‌లు చేయ‌డం, మ‌లింగ్ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం సంబంధిత వీడియోలో క‌నిపించింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ టీమ్ లో ఏం జ‌రుగుతోంద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. పాండ్యా త‌న తీరును మార్చుకోవాల‌ని కోరుతున్నారు.

 

When you have as captain.
Disrespectful for legends like Malinga and Polard, wouldn't have done this ever. Obviously not supporting and this for the whole . Let support all the team against because of arrogant pic.twitter.com/IRKD5GF7Ej

— Sαɳԃყ🌱 (@champ_sandy_)

RCB VS KKR : బెంగ‌ళూరు VS కోల్‌కతా.. ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయం.. వీరి ఆట చూడాల్సిందే.. ! 

click me!