Ben Stokes: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కొత్త సారథి దొరికాడు.. కోచ్ కూడా కన్ఫర్మ్..?

Published : Apr 27, 2022, 05:00 PM IST
Ben Stokes: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కొత్త సారథి దొరికాడు.. కోచ్ కూడా కన్ఫర్మ్..?

సారాంశం

England New Test Captain: గత కొంతకాలంగా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్  లో తీవ్ర చర్చనీయాంశమైన టెస్టు జట్టు కొత్త సారథ్య బాధ్యతలను  స్టార్ ఆల్ రౌండర్  బెన్ స్టోక్స్ కు దక్కనున్నట్టు సమాచారం. రాబోయే 48 గంటల్లో  దీనిపై కీలక ప్రకటన వెలువడనుంది. 

ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ దొరికాడు. వరుస వైఫల్యాల కారణంగా  మాజీ సారథి జో రూట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో వాటిని ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు అప్పగించనున్నట్టు సమాచారం.  ఈ మేరకు  ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) త్వరలోనే కీలక ప్రకటన  చేయనున్నది.  ఈసీబీకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా వచ్చిన రాబ్ కీ ఈ విషయమై త్వరలోనే  వెల్లడించనున్నట్టు ఇంగ్లాండ్ వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.  కొత్త కెప్టెన్ తో పాటు ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్  గా కూడా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ దాదాపు ఓకే అయినట్టే.. 

గతేడాది ఇండియా పర్యటనకు వచ్చిన తర్వాత  జో రూట్ సారథిగా దారుణంగా విఫలమవుతున్నాడు. స్వదేశంలో భారత్ తో పాటు న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. అన్నింటికన్నా ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ అవమానకర రీతిలో (0-4) తేడాతో ఓడింది. 

అదీగాక ఇటీవలే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన జో రూట్ సేన.. అక్కడ కూడా దారుణంగా ఓడింది.  వెస్టిండీస్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఇక కొత్త కెప్టెన్ కు రూట్ క్లీయర్ చేయాల్సిందేనని  అతడికి గట్టిగానే చెప్పింది. ముందుగా తాను దిగిపోనని బెట్టు చేసిన రూట్.. తర్వాత వరుస వైఫల్యాల కారణంగా  దిగిపోక తప్పదని ఈనెల 15న తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.  

 

రూట్ తప్పుకోవడంతో ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కొత్త సారథిని ఎవరిని నియమిస్తారా..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ విషయమై చర్చోపచర్చలు చేసిన ఈసీబీ.. రూట్ కే కొత్త బాధ్యతలు కట్టబెట్టింది. అతడితో పాటు యాషెస్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ జట్టును వీడిన క్రిస్ సిల్వర్వుడ్ స్థానాన్ని గ్యారీ కిర్స్టెన్ తో భర్తీ చేయనుంది. సిల్వర్వుడ్ స్థానంలో పాల్ కాలింగ్వుడ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించింది.  కానీ కిర్స్టెన్  రాకతో కాలిగ్వుడ్ ఆ బాధ్యతల నుంచి దిగిపోనున్నాడు. 

 

ఇక 30 ఏండ్ల స్టోక్స్.. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటికే 79 టెస్టులాడాడు. 35.89 సగటుతో 5,061 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలర్ గా కూడా సత్తాచాటిన రూట్.. 174 వికెట్లు సాధించాడు. ఇక 101 వన్డేలలో 2,871 పరుగులు చేసి 74 వికెట్లు తీశాడు. గతంలో స్టోక్స్ ఇంగ్లాండ్ కు మూడు వన్డేలలో కెప్టెన్ గా వ్యవహరించాడు. మూడింట్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఒక టెస్టుకు కూడా కెప్టెన్ గా ఉన్నాడు. అది డ్రాగా ముగిసింది. 

PREV
click me!

Recommended Stories

ఈజీ అన్నావ్‌గా..! ఇప్పుడేంటి మరి.. మంజ్రేకర్‌కు కోహ్లీ సెటైర్..
బంగ్లాదేశ్ పోతేనేం.. ఐసీసీ పక్కా స్కెచ్‌తో టీ20 ప్రపంచకప్‌లోకి పసికూన జట్టు.!