రాజస్థాన్ రాయల్స్‌కి షాక్... చేతి వేలి గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం...

Published : Apr 13, 2021, 11:09 PM IST
రాజస్థాన్ రాయల్స్‌కి షాక్... చేతి వేలి గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం...

సారాంశం

 పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్...  చేతి వేలు విరగడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, చేతి వేలు విరగడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.

రియాన్ పరాగ్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు డైవ్ చేసిన బెన్ స్టోక్స్, ఎడమ చేతి వేలికి గాయమైంది. స్కానింగ్‌లో చేతి వేలి ఎముక విరిగిందని తేలడంతో బెన్ స్టోక్స్, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి ఆటగాడిగా దూరం కానున్నాడు.

అయితే ఐపీఎల్ 2021 సీజన్ ముగిసేవరకూ జట్టుతోనే ఉండి, సపోర్ట్ చేయబోతున్నాడు బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ గాయం కారణంగా తప్పుకోవడంతో టీ20 నెం.1 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్స్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు