ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆరెంజ్ ఆర్మీ... డేవిడ్ భాయ్, కేన్ మామ తెలుగులో...

Published : Apr 13, 2021, 06:52 PM IST
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆరెంజ్ ఆర్మీ... డేవిడ్ భాయ్, కేన్ మామ తెలుగులో...

సారాంశం

ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ అండ్ కో...  

పేరుకే తెలుగు జట్టు అయినా... సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు ప్లేయర్లు లేరు. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు తెలుగు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, ఆరెంజ్ ఆర్మీ మాత్రం జట్టులో ఉన్న తెలుగువాళ్లను విడుదల చేసింది.

అయితే తెలుగు టీమ్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు సోషల్ మీడియా ద్వారా తెగ ప్రయత్నం చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.... ఉగాది సందర్భంగా విషెస్‌తో ముందుకొచ్చింది.

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో సహా కేన్ విలియంసన్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ... ఎంతో కష్టపడి తెలుగులో ‘ఉగాది శుభాకాంక్షలు’ అని చెప్పారు. జట్టులో తెలుగు ప్లేయర్లు లేకపోయినా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, తెలుగువాడు కావడం ఒక్కటే తెలుగువారికి ఊరటనిచ్చే అంశం.

తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, తన తర్వాతి మ్యాచ్‌లో రేపు రాయల్ ఛాలెంజర్స్‌తో పోటీపడబోతోంది.

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు