అభిమానులు అలా పిలిస్తేనే నాకు జోష్: రస్సెల్

By Arun Kumar PFirst Published Apr 30, 2019, 6:05 PM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 12లో తమ డాషింగ్ బ్యాటింగ్ తో ఉర్రూతలూగిస్తున్న ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్స్ ముందు వరుసలో వుంటాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ప్రతి బంతిని బౌండరీ బయటకు పంపించాలన్న కసితో అతడు ఆడుతుంటాడు. ఇలా కోల్‌‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ బలాన్ని పెంచడంతో పాటు బౌలింగ్ లోనూ రాణిస్తూ ఈ ఐపిఎల్ లోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ గా అభిమానుల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ తన పాత్ర కనబరుస్తూ కెకెఆర్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రస్సెల్స్ తన పుట్టినరోజున మరో  అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

గత ఆదివారం రస్సెల్స్ పుట్టిన రోజు. అదే రోజు కోల్ కతా, ముంబై ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రస్సెల్స్ 8 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో కేవలం 40 బంతుల్లోనే 80 పరుగులతో రెచ్చిపోయాడు. ఇలా కెకెఆర్ కు భారీ స్కోరు ను అందించి విజయంతో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ అనంతరం రస్సెల్స్ మాట్లాడుతూ.... తనను అభిమానులు ఎలా పిలిస్తే సంతోషంగా వుంటుందో వెల్లడించాడు. 

రస్సెల్స్ బారీ హిట్టింగ్ కు ఫిదా అయిన అభిమానులు ముద్దుగా అతన్ని సూపన్ హీరో అని పిలుస్తుంటారు. ఇలా వారు తనను సంబోధించడం చాలా ఆనందాన్నిస్తుందని రస్సెల్ వెల్లడించాడు. తనకు అవెంజర్స్ సీరిస్ లో వచ్చిన సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపాడు. అందులోని సూపర్ హీరో క్యారెక్టర్లంటే మరింత ఇష్టమని...తాను ఆడుతున్నప్పుడు
అభిమానులు సూపర్ హీరో అంటూ ఉత్సాహపరుస్తుంటూ యమ ఆనందంగా వుంటుందన్నాడు. వారు ఎంతలా ఉత్సాహపరిస్తే తాను అంతలా రెచ్చిపోతానని
రస్సెల్స్ తెలిపాడు. 

భారీ సిక్సర్లు బాదాలంటే నిజంగానే తాము సూపర్ హీరోల మాదిరిగా మారాల్సి వుంటుందన్నాడు. వేగంగా వస్తున్ర బంతిని కళ్లు, చేతులను సమన్వయ పరుచుకుంటూ బాదాల్సి వుంటుందన్నారు. కొన్నిసార్లు యార్కర్ బంతుల్ని భుజబలంతో మాత్రమే బౌండరీకి తరలించాల్సి వుంటుందన్నాడు. ఇక ఒత్తిడి సమయంలో అయితే బౌండరీని రాబట్టాలంటే మరింత కష్టపడాల్సి వుంటుందని...ఇది సూపర్ హీరోలు చేసే పనిలాంటిదేనని రస్సెల్స్ వివరించాడు. 
 
click me!