ధోని లావాదేవీలు బయటపెట్టండి: ఆమ్రపాలికి సుప్రీంకోర్టు ఆదేశం

By Arun Kumar PFirst Published Apr 30, 2019, 3:59 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థపై న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన కాలంలో తనకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదంటూ ధోని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ధోనితో జరిపిన లావాదేవీలన్నింటినికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తమ ముందుంచాలని ఆదేశించింది. 

2009 నుండి 2016 వరకు అంటూ ఆరు సంవత్సరాల పాటు ధోని ఆమ్రపాలి గ్రూప్‌ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో సంస్థ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా తన స్వస్థలం రాంచీలో ఆమ్రపాలి గ్రూప్ కు చెందిన వెంచర్ లో పెంట్ హౌజ్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే ఒప్పందం ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా తనకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో ధోని కోర్టును ఆశ్రయించాడు. 

ఆమ్రపాలి సంస్థ ఇప్పటి వరకు తాను బుక్ చేసుకున్న ఇంటిని ఇప్పటివరకు స్వాధీనం చేయలేదని ధోని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒప్పందం ప్రకారం ప్రచారకర్తగా వ్యవహరించిన సమయంలోనే తనకివవ్వాల్సిన డబ్బులను ఇవ్వలేదన్నారు. నాలుగేళ్లు గడుస్తున్న తనకు రావాల్సిన దాదాపు రూ.40 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఇబ్బంది పెడుతోందంటూ సుప్రీం కోర్టులో ధోనీ పిటిషన్ వేశాడు.  

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందే ఆ సంస్థ వద్ద ఇల్లు కొనుగోలు చేసిన 46 వేల మంది కోర్టును ఆశ్రయించారు. తమకు ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందంటూ వారు గగ్గోలుపెడుతున్నారు. ఇదే సమయంలో ధోని కూడా కోర్టును ఆశ్రయించాడు. దీంతో ధోని, ఆమ్రపాలి వివాధంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువురి మధ్య జరిపిన లావాదేవీలను బయటపెట్టాలని ఆదేశించింది.

click me!