
ప్రధాని పిలుపును శిరసావహించినందుకు బీసీసీఐకి షాక్ తగిలింది. ప్రధాని మోడీ మాటను పాటించినందుకు ట్విట్టర్‌లో బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను కోల్పోయింది. పంద్రాగస్టు సందర్భంగా అందరూ తమ సోషల్ మీడియా ఖాతాల డీపీలను త్రివర్ణ పతకాలతో నింపేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే పిలుపును బీసీసీఐ తూ చా తప్పకుండా పాటించింది. దీంతో బీసీసీఐ ఎక్స్(ట్విట్టర్) ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ టిక్ పోయింది.
బీసీసీఐ ఖాతాకు బ్లూ టిక్ లేకుండా పోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఉన్న బ్లూ టిక్ ఉన్నపళంగా ఎలా మాయమైందా? అనే గందరగోళంలో పడిపోయారు. అయితే, ఎందుకు ఈ మార్పు జరిగిందని ఆరా తీయగా విస్తూపోయే విషయం ఒకటి బయటపడింది.
Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. పంద్రాగస్టు స్పెషల్ ఇదే
ఎక్స్ సవరించిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ ఖాతా డీపీ లేదా ప్రొఫైల్ ఫొటోను మార్చితే వెంటనే ఆ బ్లూ టిక్ రద్దవుతుంది. ఆ మార్పును ఎక్స్ మేనజ్‌మెంట్ పరీక్షిస్తుంది. రివ్యూ చేసిన తర్వాత బ్లూ టిక్‌ను పునరుద్ధరిస్తుంది. అందుకే బీసీసీఐ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ మార్చడంతో దాని బ్లూ టిక్ వెరిఫికేషన్ గల్లంతైంది. త్వరలోనే బ్లూ టిక్ వెనక్కి రానుంది. పంద్రాగస్టు వేడుకలు ముగిసిన తర్వాత మళ్లీ తన ఒరిజినల్ ప్రొఫైల్ పిక్‌ను బీసీసీఐ ఎంచుకునే అవకాశాలు లేకపోలేదు. అంటే.. మరోసారి బ్లూ టిక్ ఎగిరిపోతుంది. మళ్లీ దాని ఒరిజినల్ ప్రొఫైల్ చెక్ చేసుకుని పునరుద్ధరించే అవకాశం ఉన్నది.