15న ప్రపంచకప్‌ జట్టు ప్రకటన: వడపోతలో శ్రమిస్తున్న సెలక్టర్లు

By Siva KodatiFirst Published Apr 8, 2019, 1:43 PM IST
Highlights

ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు సంబంధించి భారత జట్టును ఈ నెల 15న బీసీసీఐ ప్రకటించనుంది

ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు సంబంధించి భారత జట్టును ఈ నెల 15న బీసీసీఐ ప్రకటించనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్టు కూర్పుపై కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 23 వరకు ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన గమనించి వాళ్ల బ్యాటింగ్ స్థానాలు నిర్ణయించనున్నట్లు సమాచారం.

కాగా ఇప్పటికీ నాలుగో నెంబర్ స్ధానం, నాలుగో పేస్ బౌలర్‌పై కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జట్టును ప్రకటించేందుకు బీసీసీఐకి ఏప్రిల్ 23 వరకకు అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు ఎంపికను సులభతరం చేసేందుకు ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

మరోవైపు నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు, రిషభ్ పంత్‌‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత ఐపీఎల్‌‌లో రాయుడు ఇప్పటి వరకు మెరుగ్గా రాణించలేదు.. అయితే పంత్ మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌‌లో రెచ్చిపోతున్నాడు.

వీరిద్దరికి పోటీగా విజయ్ శంకర్ కూడా తెర మీదకి వచ్చాడు. మరి వీరిలో అదృష్టం ఎవరినీ వరించబోతుందో తెలియాలంటే 15 వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ మొదలవ్వనుంది. 

click me!