చెప్పడానికి ఇక కారణాలు లేవు: వరుసగా ఆరో ఓటమిపై కోహ్లీ స్పందన

Siva Kodati |  
Published : Apr 08, 2019, 11:49 AM ISTUpdated : Apr 08, 2019, 11:50 AM IST
చెప్పడానికి ఇక కారణాలు లేవు: వరుసగా ఆరో ఓటమిపై కోహ్లీ స్పందన

సారాంశం

వరుసగా ఆరు సార్లు ఓడిపోయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. 

వరుసగా ఆరు సార్లు ఓడిపోయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. మ్యాచ్ విన్నర్లు, ఆల్ రౌండర్లతో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఈ సీజన్‌లో అడుగుపెట్టిన బెంగళూరు నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో వరుసపెట్టి ఓటములు మూటకట్టుకుంది.

తాజాగా ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి మరో ఓటముల్లో సిక్సర్ కొట్టింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ,.. ఓటమిపై కారణాలు చెప్పడానికి ఇంకా ఏం మిగల్లేదు.. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన పనిలేదు.

ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం... కానీ అది జరగలేదు. మ్యాచులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. జట్టుగా ఆటను ఆస్వాదించాలి. లేకపోతే క్రికెట్ ఆడలేము అని కోహ్లీ అన్నాడు. జట్టుకు అవసరమైన రోజే మేం రాణించలేకపోతున్నామన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

SRH Dangerous Batsmen : ఇషాన్ నుండి అభిషేక్ వరకు.. IPL 2026 లో టాప్ 5 డేంజర్ బ్యాటర్లు, లిస్ట్ లో ఒకేఒక్క తెలుగోడు
Bumrah Top 5 Innings : ఇంటర్నేషనల్ క్రికెట్లో దశాబ్దం పూర్తి.. ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే