పాపం కోహ్లీ: ఆరోసారి కూడా బెంగళూరును పలకరించని విజయం

By Siva KodatiFirst Published Apr 8, 2019, 11:35 AM IST
Highlights

వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ బెంగళూరు కథ మారలేదు.. ఈ సీజన్‌లో ఒక్క గెలుపు కూడా నమోదు చేయని జట్టు ఏదైనా ఉందంటే అది బెంగళూరే. నిలకడ లేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో కోహ్లీసేన మరో పరాజయాన్ని మూటకట్టుకుంది

వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ బెంగళూరు కథ మారలేదు.. ఈ సీజన్‌లో ఒక్క గెలుపు కూడా నమోదు చేయని జట్టు ఏదైనా ఉందంటే అది బెంగళూరే. నిలకడ లేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో కోహ్లీసేన మరో పరాజయాన్ని మూటకట్టుకుంది.

ఆదివారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 41, మొయిన్ అలీ 32 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు పరుగులు చేయడం కష్టంగా మారింది. వరుసపెట్టి వికెట్లను కోల్పోవడంతో పాటు కీలకమైన చివరి 18 బంతుల్లో బెంగళూరు కేవలం 16 పరుగులే చేసింది.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేసింది. పృథ్వీషాతో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాక నేగి బౌలింగ్‌లో పృథ్వీ ఔటయ్యాడు.

ఆ తర్వాత ఇంగ్రామ్.. అయ్యర్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో శ్రేయస్, మోరిస్, పంత్‌లు ఔటైనా అప్పటికే మిగిలిన బ్యాట్స్‌మెన్లు లాంఛనాన్ని పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఓటమికి కారణాలు చెప్పలేము..

బుర్రంతా చెత్తతో నిండి ఉంటే మన వద్దకు వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించుకోలేం. శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌ పట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో.. బాధ్యతగా ఆడాలని ఎంత చెప్పినా ఇప్పటి వరకు అది జరగడం లేదనేది వాస్తవం. ఈ సీజన్‌లో జట్టుకు అవసరమైన రోజే మేం రాణించలేకపోతున్నామని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

click me!