ముగిసిన ఎమ్మెస్కే టర్మ్: ఇంకో ప్రసాద్ వస్తాడా... అగార్కర్‌ చేతుల్లోకా...?

By Siva KodatiFirst Published Feb 18, 2020, 3:38 PM IST
Highlights

టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ రానున్నారు. మార్చి మొదటి వారంలో కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తారని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మదన్ లాల్ తెలిపారు.

టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ రానున్నారు. మార్చి మొదటి వారంలో కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తారని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మదన్ లాల్ తెలిపారు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన కమిటీకి బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది.

కొత్త సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ మార్చి 1, 2 నాటికి పూర్తవుతుందని మదన్ లాల్ వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల స్థానం కోసం పోటీపడుతున్న వారిలో చివరి దశ ఇంటర్య్వూల కోసం నలుగురు మిగిలారు.

Aslo Read:2011 ప్రపంచ కప్ విజయం: టెండూల్కర్ కు ప్రతిష్టాత్మక అవార్డు

వీరిలో లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్‌లు ఉన్నారు. వీరిందరీలో అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు భాిస్తున్నారు.

అనుభవజ్ఞుడనే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తామన్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యలను బట్టి అత్యంత ఖచ్చితత్వంతో పాటు అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. టెస్టుల్లో వెంకటేశ్ ప్రసాద్ ఎక్కువ మ్యాచ్‌లు(33) ఆడితే.. అగార్కర్ (26) ఆడాడు.

Also Read:కోహ్లీ నయా రికార్డు... దేశంలోనే నెంబర్ వన్ స్థానం

ఇక వన్డేల్లో వెంకటేశ్ ప్రసాద్ (161) మ్యాచ్‌లు ఆడితే అగార్కర్ (191) మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాకుండా నాలుగు టీ20లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

దీనిని బట్టి చూస్తే చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టెస్టులకు పెద్ద పీట వేస్తే మాత్రం ప్రసాద్‌కు ఛాన్సులు ఉన్నాయి. మరి కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరో తెలాలంటే మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. 

click me!