IPL 2025: ఐపీఎల్ ఆగినందుకు బీసీసీఐకి కోట్ల రూపాయల నష్టం

Follow Us

సారాంశం

IPL 2025: ఇండియా, పాకిస్తాన్ గొడవల వల్ల ఐపీఎల్ 2025 ఆగిపోయింది. అయితే, త్వరలోనే మళ్ళీ మొదలవబోతోంది. వారం రోజులు ఆగినందుకు బీసీసీఐకి కోట్ల రూపాయల నష్టం జరిగింది. 

 

IPL BCCI: ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 2025 వారం రోజులు ఆగిపోయింది. మళ్ళీ మే 16 నుంచి మొదలవుతుందని సమాచారం. ఫైనల్ మే 30న ఉంటుందని టాక్. బీసీసీఐ ఇంకా అధికారికంగా చెప్పలేదు. కానీ త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, ఇలా ఐపీఎల్ ఆగిపోవడం వల్ల బీసీసీఐ భారీగానే దెబ్బ పడింది. కోట్ల రూపాలయల నష్టం జరిగింది. 

ఐపీఎల్‌లో ఎక్కువ ఆదాయం స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల నుంచే వస్తుంది. టికెట్ల ద్వారా బీసీసీఐకి చాలా డబ్బులు వస్తాయి. ఎంత ఎక్కువ మంది స్టేడియంకి వస్తే అంత ఎక్కువ లాభం. కానీ 58వ మ్యాచ్ తర్వాత అంతా గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ల టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేశారు. ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇస్తారు. దీనివల్ల బీసీసీఐకి నష్టం జరుగుతుంది. మ్యాచ్‌ల సమయంలో వచ్చే ప్రకటనల ఆదాయం కూడా తగ్గుతుంది.

బీసీసీఐకి ఐపీఎల్‌లో ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి?

ఐపీఎల్‌లో బీసీసీఐకి మీడియా హక్కులు, ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా చాలా డబ్బులు వస్తాయి. అంతా ఆగిపోవడం, క్యాన్సిల్ చేయడం వల్ల నష్టం జరిగింది. అయివే, బీసీసీఐ కూడా క్రికెట్ కంటే దేశం ముఖ్యం అని చెప్పింది. .

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కంటే కూడా బీసీసీఐ చాలా ముందుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ దగ్గరకు కూడా రాదు. బీసీసీఐ ఆస్తులు దాదాపు 18,760 కోట్ల రూపాయలు.

Read more Articles on