బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్: రవీంద్ర జడేజాకి A+ ప్రమోషన్.. కెఎల్ రాహుల్‌కి డిమోషన్...

Published : Mar 27, 2023, 09:31 AM ISTUpdated : Mar 27, 2023, 09:34 AM IST
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్: రవీంద్ర జడేజాకి A+ ప్రమోషన్.. కెఎల్ రాహుల్‌కి డిమోషన్...

సారాంశం

రవీంద్ర జడేజాకి ప్రమోషన్ ఇచ్చిన BCCI... అజింకా రహానేతో పాటు వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో దక్కని చోటు.. 

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2022-23 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ని ప్రకటించింది. టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడుతున్న స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి A+ కేటగిరికి ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. గత రెండేళ్లుగా బీసీసీఐకి A+ కేటగిరిలోకి ప్రమోట్ చేయాలనే ప్రతిపాదన వినిపిస్తూ ఉంది. అయితే గాయాలతో జడ్డూ, టీమ్‌కి వరుసగా దూరం అవుతూ ఉండడంతో అతన్ని ఆ లిస్టులో చేర్చడానికి పెద్దగా ఆసక్తి చూపించని బీసీసీఐ, ఎట్టకేలకు అతన్ని డైమండ్ కేటగిరిలో చేర్చింది..

A+ కేటగిరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. 2022 జూలైలో గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, ఆరునెలలుగా క్రికెట్‌కి దూరమైన కూడా A+ కాంట్రాక్ట్‌ని నిలుపుకోగలిగాడు.. A+  కేటగిరిలో ఉన్న నలుగురు ప్లేయర్లు, సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ.7 కోట్లు పారితోషికం అందుకుంటారు...

టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్.. A కేటగిరిలో చోటు దక్కించుకున్నారు. ఈ కేటగిరిలో ఉన్న కెఎల్ రాహుల్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు...

పేలవ ప్రదర్శనతో టీ20, టెస్టుల్లో చోటు కోల్పోయిన కెఎల్ రాహుల్, A కేటగిరి నుంచి B కేటగిరికి పడిపోయాడు. A కేటగిరిలో ఉన్న ఐదుగురు ప్లేయర్లకు ఏడాదికి రూ.5 కోట్లు చెల్లించనుంది బీసీసీఐ...

టెస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్.. బీ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. గత ఏడాది సీ గ్రేడ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌కి ప్రమోషన్ ఇచ్చి, బీ గ్రేడ్‌లోకి తీసుకొచ్చింది బీసీసీఐ... బీ గ్రేడ్‌ కేటగిరిలో ఉన్న ప్లేయర్లు ఏడాదికి రూ.3 కోట్లు పారితోషికంగా అందుకుంటారు..

ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్‌లకు గ్రేడ్ సీలో కాంట్రాక్ట్ దక్కింది. మూడు ఫార్మాట్లలో టీమిండియాలో చోటు కోల్పోయినా శిఖర్ ధావన్, తన కాంట్రాక్ట్ నిలుపుకోగలిగాడు. సీ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్లు ఏడాదికి రూ.1 కోటి పారితోషికంగా తీసుకోబోతున్నారు...

టెస్టు టీమ్‌లోకి వచ్చిన శ్రీకర్ భరత్, వైట్ బాల్‌ క్రికెట్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌, దీపక్ హుడా, సంజూ శాంసన్‌లకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. టెస్టుల్లో చోటు కోల్పోయిన వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేలకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల నుంచి తప్పించింది బీసీసీఐ. గత ఏడాది బీ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న అజింకా రహానే, ఇషాంత్ శర్మ ఈసారి కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయారు..

భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, హనుమ విహారితో పాటు మయాంక్ అగర్వాల్, దీపక్ చాహార్ కూడా బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లను కోల్పోయారు. గత ఏడాది వీరికి సీ గ్రేడ్ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది.Bhuvnes

సెంట్రల్ కాంట్రాక్ట్ పూర్తి లిస్టు:

Grade A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా

Grade A: హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్

Grade B: ఛతేశ్వర్ పూజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్

Grade c:ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే