ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టుని ప్రకటించిన బీసీసీఐ... మళ్లీ అదే తప్పు! ఆ ఇద్దరూ మిస్...

Published : Aug 21, 2023, 02:22 PM ISTUpdated : Aug 21, 2023, 02:26 PM IST
ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టుని ప్రకటించిన బీసీసీఐ... మళ్లీ అదే తప్పు! ఆ ఇద్దరూ మిస్...

సారాంశం

ఆసియా కప్ 2023 టోర్నీకి 17 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ... శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్‌లకు దక్కని చోటు.. 

ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీకి 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే ఆసియా కప్ టోర్నీకి, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జస్ప్రిత్ బుమ్రాకి వన్డే వైస్ కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగినా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వైట్ బాల్ వైస్ కెప్టెన్సీని మార్చకపోవడమే బెటర్ అని బీసీసీఐ పెద్దలు భావించారు..

రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయబోతుంటే, విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో ఆడబోతున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని వార్తలు వచ్చినా, ఆసియా కప్ 2023 టోర్నీలో అతను రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

నాలుగో స్థానంలో వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వెస్టిండీస్ టూర్‌లో ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మలకు కూడా చోటు దక్కింది. కెఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా 17 మంది జట్టులో చోటు దక్కించుకున్నారు..

కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా ఆసియా కప్ ఆడబోతుంటే, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఫాస్ట్ బౌలర్లుగా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపికయ్యారు. సంజూ శాంసన్ స్టాండ్ బై ప్లేయర్‌గా శ్రీలంకకి వెళ్లబోతున్నాడు..

ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శిఖర్ ధావన్, ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కించుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. అయితే శిఖర్ ధావన్‌ని పూర్తిగా పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్..

అలాగే స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి కూడా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక కాని యజ్వేంద్ర చాహాల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడనుంది భారత జట్టు. స్పిన్‌కి అనుకూలించే పిచ్‌ల్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కంటే యజ్వేంద్ర చాహాల్‌కే మెరుగైన రికార్డు ఉంది. ఆసియా కప్‌కి ఎంపిక చేసిన జట్టునే దాదాపు వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయొచ్చు. దీంతో చాహాల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడడమూ అనుమానంగా మారింది.. 

ఆసియా కప్ 2023 టోర్నీకి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

స్టాండ్ బై ప్లేయర్: సంజూ శాంసన్

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ