దినేశ్ కార్తిక్ కు ఊరట... కాంట్రాక్ట్ రద్దుపై వెనక్కితగ్గిన బిసిసిఐ

By Arun Kumar PFirst Published Sep 16, 2019, 6:14 PM IST
Highlights

టీంమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ కు ఊరట లభించింది. అతడికి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై బిసిసిఐ వెనక్కి తగ్గింది.  

టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ పై చర్యలు తీసుకోవడంపై బిసిసిఐ వెనక్కితగ్గింది. క్రికెట్ నియమ నిబంధనలను ఉళ్లంఘించాడని పేర్కొంటూ అతడికి బిసిసిఐ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతడు వెంటనే తప్పు ఒప్పుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారాన్ని ఇంతటితో  వదిలేయాలని నిర్ణయించినట్లు బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించారు. అతడిపై తదుపరి చర్యలేమీ వుండవని సదరు అధికారి స్పష్టం చేశారు. 
 
కరీబియన్ సూపర్ లీగ్ లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని ట్రిన్ బాగో నైట్ రైడర్స్ టీం పాల్గొంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాని  కూడా షారుఖ్ ఖానే. ఇరు జట్లకు కూడా కోచ్ గా మెక్‌కల్లమ్ వ్యవహిస్తున్నాడు. దీంతో కెకెఆర్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ ఇటీవల పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో  ట్రిన్ బాగో- సెయింట్ కిట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానానికి వెళ్లాడు. 

అయితే కార్తిక్ ఈ సందర్భంగా ట్రిన్ బాగో జట్టును ప్రమోట్ చేసేలా వ్యవహరించాడు. ఆ జట్టు జెర్సీని ధరించడంతో పాటు ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూంలోకి కూడా ప్రవేశిచాడు. కోచ్ మెక్ కల్లమ్ తో కలిసి ఆ జట్టు ఆటగాళ్లతో ముచ్చటించాడు.  బిసిసిఐ అనుమతి లేకుండా ఇలా విదేశీ లీగ్ కు  చెందిన ఓ జట్టును ప్రమోట్ చేయడం  నిబంధనలకు విరుద్దం. 

కాంట్రాక్ట్ ఆటగాడైన దినేష్ కార్తిక్ ఇలా వ్యవహారించడంపై బిసిసిఐ సీరియస్ అయ్యింది. అతడికి ఇతర లీగుల్లో ఆడేందుకు గానీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గానీ బిసిసిఐ నుండి అనుమతి లేదు.  కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘణ చర్యల కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కార్తీక్ కి బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన  కార్తిక్ బేషరుతుగా బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ఈ  వివాదానికి ఇక్కడితోనే తెరపడింది. 

సంబంధిత  వార్తలు

షారుఖ్ జట్టును ప్రమోట్ చేయడం తప్పే...బిసిసిఐకి కార్తిక్ క్షమాపణలు

దినేష్ కార్తీక్ కి బీసీసీఐ నోటీసులు

   

click me!