ఈ సారి వర్షమే కాపాడింది.. పాక్ సేనపై షోయబ్ అక్తర్

Published : Sep 11, 2023, 11:24 AM IST
ఈ సారి వర్షమే కాపాడింది.. పాక్ సేనపై షోయబ్ అక్తర్

సారాంశం

దాదాపు రెండు గంటల విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభం అవుతుందనుకుంటుండగా మళ్లీ చినుకులతో వాన మొదలైంది. ఫలితంగా మ్యాచ్ వాయిదా పడింది.

ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా  - పాకిస్తాన్ మ్యాచ్‌‌ రిజర్వు డేకి వాయిదా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన తర్వాత భారీ వర్షం కురిసింది.  దాదాపు రెండు గంటల విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభం అవుతుందనుకుంటుండగా మళ్లీ చినుకులతో వాన మొదలైంది. ఫలితంగా మ్యాచ్ వాయిదా పడింది.

నిన్న వాయిదా పడిన మ్యాచ్ ఈ రోజు మళ్లీ  జరగనుంది. నిన్న ఎక్కడి నుంచి మ్యాచ్ ఆగిపోయిందో, మళ్లీ అక్కడి నుంచే ఈ మ్యాచ్  ప్రారంభం కానుంది. కాగా, నిన్న మ్యాచ్ ఆగిపోవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. నిన్నటి మ్యాచ్ లో పాక్ టీమ్ సరిగా ఆడలేదని షోయబ్ అభిప్రాయపడ్డాడు.

 

లీగ్ స్టేజ్ లో వర్షం భారత్ కు అనుకూలంగా మారితే, సూపర్ 4మ్యాచ్ లో భారత బ్యాటింగ్ దాడి నుంచి వరుణుడు పాక్ రక్షించాడని షోయబ్ అక్తర్ సెటైర్ వేశారు. తాను మ్యాచ్ చూసేందుకు శ్రీలంక వచ్చానని చెప్పాడు. భారత్, పాక్ అభిమానులంతా మ్యాచ్ కోసం వేచి చూస్తన్నట్లు చెప్పారు. ఇంతకు ముందు మ్యాచ్ లో వరుణుడు భారత్ ని కాపాడాడని, ఈ రోజు వర్షం పాక్ ని రక్షించింది అని అక్తర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. మరి, ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఎవరు గెలుస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?