క్రికెటర్ కాకుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు... మొయిన్ ఆలీపై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు...

Published : Apr 06, 2021, 04:52 PM ISTUpdated : Apr 07, 2021, 08:18 AM IST
క్రికెటర్ కాకుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు... మొయిన్ ఆలీపై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు...

సారాంశం

మొయిన్ ఆలీ క్రికెటర్ కాకుంటే, టెర్రరిస్ట్ అయ్యేవాడంటూ ట్వీట్ చేసిన తస్లీమా నస్రీన్... వివాదాస్పద బంగ్లా రచయిత్రిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్న సీఎస్‌కే అభిమానులు...

బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్, ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ ఆలీపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మొయిన్ ఆలీ క్రికెటర్ కాకపోయి ఉంటే, టెర్రరిస్ట్ అయ్యేవాడు’ అంటూ తస్లీమా నస్రీన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.

తస్లీమా నస్రీన్, మొయిన్ ఆలీని టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడుతున్న మొయిన్ ఆలీ, ఓ అల్కహాల్ బ్రాండ్ లోగోను జెర్సీపై ధరించడానికి ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి.

తస్లీమా కామెంట్లకి ఇదే కారణమా? లేక మరేదైనా ఉందనేది తెలీదు. అయితే ముస్లింగా పుట్టినంత మాత్రాన టెర్రరిస్ట్ అవుతారా? అంటూ తస్లీమా నస్రీన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

PREV
click me!

Recommended Stories

IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?