ఆసియా కప్ కోసం నిప్పుల మీద నడిచిన బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీమ్ షేక్... ఇదెక్కడి మాస్ ప్రిపరేషన్స్‌ రా బాబూ..

Published : Aug 19, 2023, 03:28 PM IST
ఆసియా కప్ కోసం నిప్పుల మీద నడిచిన బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీమ్ షేక్... ఇదెక్కడి మాస్ ప్రిపరేషన్స్‌ రా బాబూ..

సారాంశం

ఆసియా కప్ 2023 ప్రిపరేషన్స్‌లో భాగంగా నిప్పుల మీద నడుస్తూ బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీమ్ షేక్ ప్రిపరేషన్స్... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

ఆసియా కప్ 2023 టోర్నీ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లో జరగాల్సిన ఈ టోర్నీని భారత జట్టు కోసం హై బ్రీడ్ మోడల్‌లో పాకిస్తాన్, శ్రీలంక వేదికల్లో నిర్వహించబోతున్నారు. ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ప్రిపరేషన్స్ మొదలెట్టేశాయి..

గాయంతో బంగ్లా వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, ఆసియా కప్ 2023 టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడబోతోంది బంగ్లాదేశ్ జట్టు. 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ షకీబ్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీమ్ షేక్, ఆసియా కప్ 2023 ప్రిపరేషన్స్‌లో భాగంగా నిప్పుల మీద నడుస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

బంగ్లాదేశ్ సోషల్ మీడియా మేనేజర్ సైఫ్ అహ్మద్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. గ్రౌండ్ మీద నిప్పులు చేసి, దాని మీద నయీమ్ షేక్‌ని నడిపించాడు అతని పక్కనున్న వ్యక్తి. మైండ్ ట్రైనింగ్ అంటూ చెప్పినా కాళ్లు కాలితే, మనసు ఎలా గట్టి పడుతుందనే లాజిక్‌ని చాలామంది విశ్వసించడం లేదు. ఇది కాళ్లకు సంబంధించిన వర్కవుట్లలో భాగంగా చేశారా? లేక బంగ్లాదేశ్ గెలవాలని కోరుకుంటూ దేవుడికి మొక్కు చెల్లిస్తూ చేసిన మూఢనమ్మకమా అనేది తేలాల్సి ఉంది. 

ఇప్పటిదాకా 4 వన్డేలు మాత్రమే ఆడిన మహ్మద్ నయీం షేక్, 2.5 సగటుతో 10 పరుగులు మాత్రమే చేశాడు. 22 టీ20 మ్యాచుల్లో 27.14 సగటుతో  570 పరుగులు చేసిన మహ్మద్ నయీం షేక్, 43 లిస్టు ఏ మ్యాచుల్లో 44.43 సగటుతో 1822 పరుగుుల చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్‌కి విపరీతమైన హైప్ ఉంటుంది. ఆగస్టు 31న ఈ రెండు జట్లూ శ్రీలంకలోనే పల్లెకేలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి..

సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ కంటే ముందే బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. దీనికి ప్రధాన కారణం లంకలో శ్రీలంక ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడమే కాకుండా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కీ, ఈ మ్యాచ్‌కీ టికెట్ల రేట్లలో చాలా వ్యత్యాసం ఉంది..

గ్రూప్ Aలో ఉన్న పాకిస్తాన్, నేపాల్ మధ్య ముల్తాన్‌తో తొలి మ్యాచ్ జరుగుతుంది. నేపాల్‌కి ఇదే మొట్టమొదటి ఆసియా కప్. నేపాల్ మరీ చరిత్ర సృష్టిస్తే తప్ప గ్రూప్ A నుంచి ఇండియా, పాకిస్తాన్... సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించడం ఖాయం.  గ్రూప్ Bలో ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య హోరాహోరీ ఫైట్ జరగనుంది. 

 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?