నేడే బెంగళూరు టీ20... పొంచివున్న వర్షం ముప్పు

By Arun Kumar PFirst Published Sep 22, 2019, 2:19 PM IST
Highlights

భారత్-సౌతాఫ్రికాల మధ్య జరగనున్న మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. బెంగళూరు వేదికన జరగాల్సిన ఈ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

వన్డే ప్రపంచ కప్ తర్వాత టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఇందులో భాగంగా జరుగుతున్న టీ20 సీరిస్ నేటితో(ఆదివారం) ముగియనుంది. అయితే ఇప్పటికే వరుణుడి దెబ్బకి మూడు మ్యాచుల సీరిస్ కాస్తా రెండు మ్యాచ్ ల సీరిస్ గా మారింది. తాజాగా అది కేవలం ఒక్కమ్యాచ్ కే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నారు. ఇవాళ బెంగళూరు వేదికన జరగాల్సిన చివరి టీ20కి వర్షం ముప్పు పొంచివున్నట్లు సమాచారం.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా-సౌతాఫ్రికా జట్లు ఇవాళ మూడో టీ20 ఆడాల్సి వుంది. రాత్రి 7గంగల నుండి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు వాతావరణం సహకరించకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం కారణంగా నగరంలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం వుందట. ఇది సాధారణం నుండి భారీ స్థాయిలో కూడా వుండనుందట. అలాగే దట్టమైన మేఘాలు కూడా కమ్ముకోవడంతో వెలుతురులేమి కూడా వుండనుంది. కాబట్టి మ్యాచ్ జరిగే అవకాశాలు సగం సగంగా వున్నాయంట్లే అధికారులు వెల్లడించారు.  

ఇప్పటికే ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా కనీసం ఒక్కబంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ ఇటీవలే మొహాలీలో ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. ఇందులో కోహ్లీ, ధవన్ లు రాణించి పర్యటక జట్టును ఓడించారు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో మూడో టీ20 ఈ సీరిస్ విజయాన్ని నిర్ణయాల్సింది.వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశాలుండటం కోహ్లీసేనను కలవరపెట్టకున్నా సఫారీలను భయపెడుతోంది. ఈ  మ్యాచ్ నెగ్గి టీమిండియా విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్న ఆ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా  కనిపిస్తున్నాడు. 

బెంగళూరు టీ20 రద్దయితే భారత్ 1–0 సీరిస్ గెలుచుకోనుంది. గెలిస్తే మాత్రం 2-0 తేడాతో టైటిల్  కైవసం చేసుకోనుంది. ఒకవేళ సఫారీలు పుంజుకుని విజయం సాధించినా 1-1 తో సీరిస్ సమం కానుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కోహ్లీసేన చేతినుండి సీరిస్ చేజారే అవకాశాలు లేవన్నమాట.

click me!