Asia Cup 2023: బాబర్ ఆజమ్ రికార్డు సెంచరీ! పసికూన నేపాల్‌‌పై పాక్ ప్రతాపం..

Published : Aug 30, 2023, 06:23 PM ISTUpdated : Aug 30, 2023, 06:51 PM IST
Asia Cup 2023: బాబర్ ఆజమ్ రికార్డు సెంచరీ! పసికూన నేపాల్‌‌పై పాక్ ప్రతాపం..

సారాంశం

వన్డేల్లో 19వ సెంచరీ బాదిన బాబర్ ఆజమ్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు.. ఇఫ్తికర్ అహ్మద్ హాఫ్ సెంచరీ

ఆసియా కప్ 2023 టోర్నీకి ఘనంగా ఆరంభించాడు  పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. వన్డేల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్న బాబర్ ఆజమ్, పసికూన నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. బాబర్ ఆజమ్‌కి ఇది వన్డేల్లో 19వ సెంచరీ. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీల మార్కు అందుకున్న ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు బాబర్ ఆజమ్..

బాబర్ ఆజమ్‌ 102 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు అందుకోగా ఇంతకుముందు హషీమ్ ఆమ్లా 104, విరాట్ కోహ్లీ 124 ఇన్నింగ్స్‌ల్లో 19 వన్డే శతకాలు నమోదు చేశారు. ఓవరాల్‌గా బాబర్ ఆజమ్‌కి ఇది 31వ అంతర్జాతీయ సెంచరీ. పాక్ తరుపున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు బాబర్ ఆజమ్ మరో రెండు సెంచరీలు చేస్తే చాలు. పాక్ తరుపున వన్డేల్లో 20 సెంచరీలు చేసిన సయ్యద్ ఆన్వర్, ఇప్పటిదాకా అత్యధిక వన్డే సెంచరీలు చేసిన పాక్ బ్యాటర్‌గా ఉన్నాడు..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోరు చేసింది.. 20 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన ఫకార్ జమాన్, కరణ్ కేసీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ రనౌట్ అయ్యాడు.

25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ని మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 50 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, నిర్లక్ష్యంగా రనౌట్ అయ్యాుడ..

దీపేంద్ర సింగ్ వేసిన త్రో తనకి ఎక్కడ తగులుతుందోననే భయంతో వంగుతూ పరుగెత్తిన రిజ్వాన్ రనౌట్ అయ్యాడు. 14 బంతుల్లో 5 పరుగులు చేసిన అఘా సల్మాన్‌ని లమిచానే అవుట్ చేశాడు. 72 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మహ్మద్ రిజ్వాన్, 56 పరుగుల వద్ద ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని కరణ్ కేసీ జారవిడిచాడు. 

అలా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బాబర్ ఆజమ్, 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ మార్కు అందుకోవడానికి కేవలం 37 బంతులే వాడుకున్నాడు బాబర్ ఆజమ్. మరో ఎండ్‌లో ఇఫ్తికర్ అమ్మద్, 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. వస్తూనే ఫోర్ బాదిన షాదబ్ ఖాన్, చివరి బంతికి పెవిలియన్ చేరాడు. 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్ అజేయ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !