జనాలు లేరు! హైప్ లేదు.. ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో కనిపించని క్రికెట్ ఫ్యాన్స్...

Published : Aug 30, 2023, 03:43 PM IST
జనాలు లేరు! హైప్ లేదు.. ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో కనిపించని క్రికెట్ ఫ్యాన్స్...

సారాంశం

ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకలు... ఆహ్వానం అందినా హాజరుకాని బీసీసీఐ పెద్దలు! ఖాళీ స్టేడియంలో మొదటి మ్యాచ్..

ఆసియా కప్ 2023 టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సొంతం చేసుకుంది. అనేక మలుపుల తర్వాత హైబ్రీడ్ మోడల్‌లో 4 మ్యాచులు పాకిస్తాన్‌లో, 9 మ్యాచులు శ్రీలంకలో నిర్వహించేలా షెడ్యూల్‌ని ఖరారు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. కొన్ని దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న మల్టీ నేషనల్ క్రికెట్ టోర్నీ ఇదే...

అయితే ఆసియా కప్ 2023 టోర్నీకి హైప్ క్రియేట్ చేయడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా విఫలమైంది. రిజల్ట్ ఖాళీ స్టేడియాల్లో ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకలు నిర్వహించాల్సి వచ్చింది. ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఆరంభ వేడుకలకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్టు వార్తలు వచ్చాయి..

అయితే బీసీసీఐ నుంచి ఎవ్వరూ ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో పాల్గొనలేదు. ఆసియా కప్ 2023 టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా మాత్రమే, ముల్తాన్‌లో టీమిండియా తరుపున హాజరయ్యాడు. 

నేపాల్ సింగర్ త్రిసల గురుంగ్,  పాకిస్తాన్ సింగర్ అయిమా బెగ్... ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మ్యాచ్ ఆరంభ సమయానికి ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పట్టుమని 100 మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా లేకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది..

పాకిస్తాన్‌లో క్రికెట్‌కి బీభత్సమైన క్రేజ్ ఉంది. పాక్ సూపర్ లీగ్ మ్యాచులు చూసేందుకు జనాలు ఎగబడతారు. అయితే పసికూన నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్ కావడం, ఆసియా కప్‌ 2023 టోర్నీని జనాల్లోకి తీసుకెళ్లడంతో పీసీబీ విఫలం కావడమే ఇలా ఖాళీ స్టేడియంలో మ్యాచులు నిర్వహించడానికి కారణం.

పాకిస్తాన్‌లో మొత్తంగా జరిగేదే నాలుగు మ్యాచులు. అందులో ఒకటి ముల్తాన్‌లో. మిగిలిన లాహోర్‌లో. గ్రూప్ స్టేజీలో నేపాల్‌తో ముల్తాన్‌తో మ్యాచ్ ఆడే పాకిస్తాన్, ఆ తర్వాత ఓ సూపర్ 4 మ్యాచ్ కోసమే మాత్రమే పాక్‌లో అడుగుపెట్టనుంది. మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి..

లాహోర్ వేదికగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచులు జరగబోతున్నాయి. పాకిస్తాన్ ఆడే మ్యాచులకే జనాలు రానప్పుడు, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఆడే మ్యాచులు క్రికెట్ ఫ్యాన్స్ వస్తారా? పొరుగు దేశం ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్‌కి మ్యాచులు చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ వచ్చినా ఆ సంఖ్య చాలా తక్కువే ఉండొచ్చు.. 

మొత్తానికి దశాబ్దాల తర్వాత ఓ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకున్న పాకిస్తాన్, మొదటి మ్యాచ్‌తోనే తుస్సుమనిపించింది. సాయంత్రం వరకూ జనాలు, స్టేడియానికి వచ్చినా... ఆరంభంలో ఖాళీగా ఉన్న స్టేడియం, మ్యాచ్ ముగిసేలోపు ఫుల్ అవ్వడం చాలా కష్టం. శ్రీలంకలో ఇండియా మ్యాచులు ఉండడంతో అక్కడ రెస్పాన్స్, పాకిస్తాన్‌లో కంటే మెరుగ్గానే ఉండొచ్చు.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !