సహచర ఆటగాడి గర్ల్‌ఫ్రెండ్‌తో ఆ పని చేస్తూ దొరికపోయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం

Published : Jan 17, 2023, 10:32 AM ISTUpdated : Jan 17, 2023, 10:45 AM IST
సహచర ఆటగాడి గర్ల్‌ఫ్రెండ్‌తో ఆ పని చేస్తూ దొరికపోయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం

సారాంశం

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ లో మరో కుదుపు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ ఒంటిమీద దుస్తులు లేకుండా ఉన్న ఓ వీడియోలో అతడు..  పాక్ టీమ్ లోని ఓ సభ్యుడి  గర్ల్‌ఫ్రెండ్ తో అసభ్యంగా... 

ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్ లు ఓడుతూ,  నిర్జీవమైన పిచ్ లను తయారుచేస్తూ అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలవుతున్న పాకిస్తాన్ క్రికెట్ కు మరో భారీ కుదుపు. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్   చేసిన (?) పనికి  పాకిస్తాన్ క్రికెట్ నివ్వెరపోయింది.  తాజాగా  సోషల్ మీడియాలో విడుదలైన ఓ వీడియోలో బాబర్.. తన సహచర ఆటగాడి గర్ల్‌ఫ్రెండ్ తో  సెక్స్ ఛాటింగ్ చేస్తూ  దొరికిపోయాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఒంటిమీద దుస్తులు లేకుండా ఉన్న బాబర్..  పాక్ జట్టులోని ఓ సభ్యుడి  గర్ల్‌ఫ్రెండ్ తో అసభ్యంగా చాటింగ్ చేసినట్టు స్పస్టంగా తెలుస్తున్నది.  తనకు కావల్సినది ఇస్తే  తన ప్రియుడికి జట్టులో చోటు ఖాయం చేస్తానని బాబర్ ఆ వీడియోలో చెప్పినట్టు పలు ఆడియో ఫైల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంతేగాక అతడి పర్సనల్ ఫోటోలు,   ఆడియో ఫైల్స్  కూడా  నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

అయితే ఈ వీడియోలో ఉన్నది నిజంగా  బాబర్ ఆజామేనా..? లేక  ఎవరైనా కావాలని  ఫేస్ మార్పింగ్ చేశారా..? అన్నది తేలాల్సి ఉంది.  ఇక పాకిస్తాన్ క్రికెట్ ను ఓ కుదుపు కుదుపుతున్న ఈ వీడియోపై ఇప్పటికైతే అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గానీ ఇటు బాబర్ గానీ ఏ  విధమైన ప్రకటనా విడుదల చేయలేదు. కనీసం ఒక ఖండన కూడా లేదు. దీంతో ఈ వీడియోలో ఉన్నది నిజంగా బాబరేనా..? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 

 

కాగా ఈ వీడియోలో ఉన్నది బాబరేనని పలువురు నెటిజన్లు వాపోతున్నారు. ఆడియో ఫైల్స్ లో అతడి వాయిస్,  వీడియోలో బద్దకంగా మాట్లాడుతూ  ఉన్న అతడి హావబావాలు అన్నీ బాబర్ కు సరితూగేవే అని   ఇందులో కొట్టిపారేయడానికి ఏమీ లేదని కూడా  పలువురు వాపోతున్నారు. 

ఇప్పటికే  స్వదేశంలో వరుసగా టెస్టు, వన్డే సిరీస్ లు ఓడుతూ  తీవ్ర విమర్శల పాలవుతున్న   బాబర్ కు ఇది షాకింగ్ న్యూసే.   గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లలో దారుణ ఓటముల తర్వాత  అతడి కెప్టెన్సీ కూడా ఊడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   నాలుగైదు రోజుల క్రితం న్యూజిలాండ్ తో కూడా వన్డే సిరీస్ ను కోల్పోయిన పాకిస్తాన్ కు త్వరలోనే షాన్ మసూద్ ను టెస్టులు, వన్డేలకు సారథిగా నియమిస్తారని   ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో బాబర్ ఇమేజీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే  వాదనలూ ఉన్నాయి. మరి  అసలు నిజమేంటో ఆ పెరుమాళ్‌కే ఎరుక..!

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది