Babar Azam : ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఘోర వైఫల్యం.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్ ఆజాం

By Siva Kodati  |  First Published Nov 15, 2023, 7:11 PM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో జట్టు ఘోర వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 
 


పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో జట్టు ఘోర వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 
 

pic.twitter.com/8hZqS9JH0M

— Babar Azam (@babarazam258)

 

Latest Videos

undefined

‘ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ దీనికి ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నాను. తాను మూడు ఫార్మాట్లలో ఒక ప్లేయర్‌గా పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కు జట్టుకు సహాయ సహాకారాలు అందిస్తా ’’ అని బాబర్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

కాగా.. భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో బాబర్ పాకిస్తాన్‌‌తో నిరాశపరిచాడు. జట్టును నాకౌట్‌కు తీసుకెళ్లడంతో అతను విఫలమయ్యాడు. తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది పాయింట్లతో పాకిస్తాన్‌లో ఐదవ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. వ్యక్తిగతంగానూ బాబర్ ఆజాం ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. 9 మ్యాచ్‌లలో 320 పరుగులు చేసిన బాబర్.. వ్యక్తిగత సగటు 40 కాగా, స్ట్రైక్ రేట్ 82.90 . 

2020లో టెస్ట్ , వన్డే ఫార్మాట్ కెప్టెన్సీని చేపట్టడానికి ముందు బాబర్‌ను తొలుత 2019లో తొలిసారి టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించింది పాక్ క్రికెట్ బోర్డ్. బాబర్ తన నిర్ణయానికి నిర్దిష్టమైన కారణాన్ని ప్రస్తావించనప్పటికీ, ప్రపంచకప్‌లో జట్టు ఘోర వైఫల్యం నేపథ్యంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ఈ ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ సహా అఫ్ఘనిస్తాన్ చేతిలోనూ పాక్ ఘోర పరాజయం పాలవ్వడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఇవాళ ఉదయం లాహోర్‌లో పీసీబీ చీఫ్‌ని కూడా బాబర్ కలిశాడు. గడ్డాఫీ స్టేడియంలోని పీసీబీ ప్రధాన కార్యాలయం నుంచి బాబర్ కారును అభిమానులు, జర్నలిస్టులు వేటాడిస్తున్నట్లు టీవీలో వీడియోలు వైరల్ అయ్యాయి. 

 

click me!