బాబర్ ఆజమ్ అంటే ఓ ప్లేయర్‌గా చాలా ఇష్టం. అతను నాకు తమ్ముడిలాంటోడు... అతనిలో కెప్టెన్సీ స్కిల్స్ లేవు. అసలు కెప్టెన్‌గా పనికి రాడు... - పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ కామెంట్స్..
2019 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, సెమీ ఫైనల్ చేరలేకపోయింది. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్, 2019 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్‌పై విజయాలు అందుకుంది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ గెలిచిన నాలుగు మ్యాచుల్లో మూడు శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ వంటి చిన్న/ఫామ్‌లో లేని టీమ్స్‌పైన వచ్చినవే. న్యూజిలాండ్‌తో మ్యాచ్ విజయానికి పూర్తిగా లక్ కారణం. మ్యాచ్ సజావుగా పూర్తి ఓవర్ల పాటు సాగి ఉంటే, 401 పరుగుల టార్గెట్‌ని ఛేదించడం అయ్యే పనికాదు..
గత ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్, ఈసారి కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...
‘నాకు బాబర్ ఆజమ్ అంటే ఓ ప్లేయర్‌గా చాలా ఇష్టం. అతను నాకు తమ్ముడిలాంటోడు. బాబర్ ఆజమ్, ప్రపంచంలో బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా కావాలని నేను కూడా కోరుకున్నాను. అతను నాలుగేళ్లుగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అయితే అతనిలో ఎలాంటి ఇంప్రూమెంట్ కనిపించడం లేదు.
పీసీబీ నుంచి బాబర్ ఆజమ్‌కి ఎప్పుడూ కెప్టెన్సీ ప్రెషర్ లేదు. కెప్టెన్‌గా సక్సెస్ కావాలంటే పరిస్థితికి తగ్గట్టుగా తనని తాను మార్చుకోగలగాలి. నాలుగేళ్లలో ఎప్పుడూ బాబర్ ఆజమ్‌లో దీన్ని నేను చూడలేదు. అతనిలో కెప్టెన్సీ స్కిల్స్ లేవు. అసలు కెప్టెన్‌గా పనికి రాడు. వరల్డ్ కప్‌లో టీమ్ చాలా తప్పులు చేసింది. అందుకే భారీ మూల్యం చెల్లించుకుంది. వరల్డ్ కప్ గెలవడానికి ఓ ప్లానింగ్‌తో వెళ్లినట్టే కనిపించలేదు..
టెస్టుల్లో బాబర్ ఆజమ్‌కి కెప్టెన్సీ సెట్ అవుతుంది. అతని ఆటకి అదే సెట్ అవుతుంది. వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం కెప్టెన్సీని వేరే వాళ్లకు అందిస్తే బెటర్ అని నా ఉద్దేశం.. ఈ నిర్ణయం తీసుకోవడానికి పీసీబీకి కావాల్సినంత సమయం ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ..