బౌల్ట్ కి సూర్యకుమార్ యాదవ్ హిందీ టెస్ట్.. ఫన్నీ వీడియో

Published : Apr 14, 2021, 01:11 PM IST
బౌల్ట్ కి సూర్యకుమార్ యాదవ్ హిందీ టెస్ట్.. ఫన్నీ వీడియో

సారాంశం

ఈ మ్యాచ్ లో ముంబయి విజయానికి సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ తమ వంతు సాయం చేశారు. ఈ నేపథ్యంలో..వారు మ్యాచ్ విజయం తర్వాత కొంచెం ఫన్ క్రియేట్ చేశారు.

ఐపీఎల్ 2021లో ముంబయి ఇండియన్స్ తొలి విజయం అందుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా... లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 10 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.

కాగా.. ఈ మ్యాచ్ లో ముంబయి విజయానికి సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ తమ వంతు సాయం చేశారు. ఈ నేపథ్యంలో..వారు మ్యాచ్ విజయం తర్వాత కొంచెం ఫన్ క్రియేట్ చేశారు. వారు ఫన్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ట్రెంట్ బౌల్ట్ కి సూర్యకుమార్ యాదవ్ హిందీ టెస్టు పెట్టాడు.

సూర్యకుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు.. బౌల్ట్ హిందీలో సమాధానం ఇచ్చాడు. ఆ వీడియో ముంబయి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా.. నిన్నటి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 36 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. అందులో ఏడు ఫోర్లు, రెండు సిక్సులు ఉండటం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !